AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అదిరింది’ బ్యాచ్ వెనక్కి తగ్గిందేంది..?

తెలుగు స్మాల్ స్క్రీన్‌పై కామెడీ షోల హంగామా అంతా, ఇంతా కాదు. ‘జబర్ధస్’ అదే రేంజ్‌లో దుమ్ము రేపుతుండగా…’అదిరింది’ రేస్‌లో నిలబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక పండుగ వచ్చిందంటే ఈ కమెడియన్లు ఓ స్పెషల్ ప్రొగ్రామ్‌తో ప్రేక్షకుల ముందు వాలిపోతారు. పండుగురోజు నవ్వుల ఆనందాల్ని మరికొంత రెట్టింపు చేస్తారు. మల్లెమాల ఎంటర్టైన్‌మెంట్స్ ఈటీవీతో కలిసి ఈ ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత పలు చానల్స్ ఇదే బాటలో నడిచినా అంతగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే […]

'అదిరింది' బ్యాచ్ వెనక్కి తగ్గిందేంది..?
Ram Naramaneni
|

Updated on: Mar 20, 2020 | 8:27 PM

Share

తెలుగు స్మాల్ స్క్రీన్‌పై కామెడీ షోల హంగామా అంతా, ఇంతా కాదు. ‘జబర్ధస్’ అదే రేంజ్‌లో దుమ్ము రేపుతుండగా…’అదిరింది’ రేస్‌లో నిలబడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక పండుగ వచ్చిందంటే ఈ కమెడియన్లు ఓ స్పెషల్ ప్రొగ్రామ్‌తో ప్రేక్షకుల ముందు వాలిపోతారు. పండుగురోజు నవ్వుల ఆనందాల్ని మరికొంత రెట్టింపు చేస్తారు. మల్లెమాల ఎంటర్టైన్‌మెంట్స్ ఈటీవీతో కలిసి ఈ ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత పలు చానల్స్ ఇదే బాటలో నడిచినా అంతగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే జబర్దస్త్ కమెడియన్లు జనాలకు అలవాటు అయ్యారు. ఇంట్లో మనుషులుగా మారిపోయారు.  అయితే ఈసారి ఉగాది పండుగకు ‘జబర్దస్త్’ బ్యాచ్…”పండగ సార్..పండగ అంతే” తో ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయిపోయింది. వీళ్ళకి పోటీగా ‘అదిరింది’ బ్యాచ్ “బాబుగారి ఇంట్లో బుట్ట భోజనం”తో బరిలోకి దిగింది. ‘జబర్దస్త్’ ఆర్టిస్ట్‌లతో పాటు జడ్జ్ నాగబాబు.. ‘జబర్దస్త్’ మాజీ డైరెక్టర్లు నితిన్-భరత్ కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వడంతో రెండీటి మధ్య పోటీ టంకాపోరుగా ఉంటుందని అందరూ భావించారు. పండగరోజు నవ్వుల జాతరే అని ఖుషీ అయ్యారు. పోటీ కూడా ఓ రేంజ్‌లో ఉంది కాబట్టి ఎంటర్టైన్‌మెంట్ కూడా అదే రేంజ్‌లో ఉంటుందనుకున్నారు బుల్లితెర ఆడియెన్స్.

కానీ ఇక్కడే సడన్ ట్విస్ట్ ఇచ్చింది “బాబుగారి ఇంట్లో బుట్టభోజనం” బ్యాచ్. పండగ రోజు కాకుండా.. మార్చి 22న ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రసారమవుతుందని ప్రోమోలో వెల్లడించింది. స్వీటీ అనుష్క స్పెషల్ అప్పిరియన్స్, అందాల అనసూయ క్లాసికల్ డ్యాన్స్, నాగబాబు డాటర్ నిహరిక స్పెషల్ స్కిట్, ఇస్మార్ట్ సత్తి టిపికల్ కామెడీ లాంటి స్పెషాలిటీస్ ఉన్నప్పటికి ఎందుకు వెనక్కి తగ్గిందని పలువురు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. రేటింగ్స్‌ ద్వారా ఎవరో గొప్పో తేలిపోయే సమయం వచ్చినప్పుడు..ఇలా వెనకడుగు వెయ్యడం సరికాదని చెప్పుకుంటున్నారు. గతంలో అందరూ కలిసి ఉన్న సమయంలో ఈటీవీలో ‘సకుటుంబ సపరివార సమేతంగా’ పేరుతో..ఇదే తరహా కార్యక్రమాన్ని చేశారు. ఆ థీమ్‌తో ప్రస్తుతం “బాబుగారి ఇంట్లో బుట్టభోజనం”  కార్యక్రమానికి రూపకల్పన చేశారని కూడా వార్తలొస్తున్నాయి. మరి ఈ విమర్శలకు ‘అదిరింది’ టీమ్ ఎలాంటి ఆన్సర్స్ ఇస్తుందో వేచిచూడాలి.