చిరు సరసన ఐష్..?ఈసారైనా క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందా..!
తన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో కొరటాలతో సెట్స్ మీదకు వెళ్లనున్నాడు. చిరు కోసం కొరటాల పవర్‌ఫుల్ కథను సిద్ధం చేయగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ కోసం నటులను ఎంపిక చేసే పనిలో కొరటాల ఉండగా.. హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం తమన్నా, అనుష్క, నయనతార, […]
తన ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి త్వరలో కొరటాలతో సెట్స్ మీదకు వెళ్లనున్నాడు. చిరు కోసం కొరటాల పవర్‌ఫుల్ కథను సిద్ధం చేయగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మరోవైపు ఈ మూవీ కోసం నటులను ఎంపిక చేసే పనిలో కొరటాల ఉండగా.. హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ను అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం తమన్నా, అనుష్క, నయనతార, శృతీహాసన్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా ఐశ్వర్య పేరు లిస్ట్‌లో చేరింది. ఈ మేరకు ఐష్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే చిరు, ఐశ్వర్యరాయ్ కాంబినేషన్‌లో మూవీని తెరకెక్కించేందుకు గతంలో పలువురు దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇంతవరకు ఈ కాంబినేషన్ సెట్ అవ్వలేకపోయింది. ఇప్పుడైనా ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి. ఇక ఈ చిత్రంలో చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. వచ్చే ఏడాది ఉగాదికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ‘సైరా’ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, బ్రహ్మాజీ, రోహిణి, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై రామ్ చరణ్ నిర్మించిన ఈ మూవీకి అమిత్ త్రివేది సంగీతం అందించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సైరాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.