AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiru Nag Sankranti Celebrations:కొణిదెలవారింట వైభవంగా సంక్రాంతి సంబరాలు.ఈసారి కొత్తఅల్లుడే కాదు..అనుకోని అతిథి కూడా

కొడుకులు, అల్లుళ్లు, కూతుళ్లతో కలిసి ఎంతో ఆనందంగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు చిరంజీవి. అయితే ఈసారి వేడుకల్లో అనుకోని అతిధి కనిపించారు. ఆయనే అక్కినేని నాగార్జున. చిరు నాగ్ ల మధ్యనే కాదు...

Chiru Nag Sankranti Celebrations:కొణిదెలవారింట వైభవంగా సంక్రాంతి సంబరాలు.ఈసారి కొత్తఅల్లుడే కాదు..అనుకోని అతిథి కూడా
Surya Kala
|

Updated on: Jan 15, 2021 | 3:01 PM

Share

Chiru Nag Sankranti Celebrations:తెలుగువారింట సంక్రాంతి పండుగ అంటే కుటుంబాన్ని అంతటినీ ఒక్కచోటకు చేర్చే పండగ. ఉపాధి కోసం ఎవరు ఎంత దూరంలో ఉన్నా సొంత ఊళ్లకు ప్రయాణమవుతారు. తమ కుటుంబ సభ్యులు , స్నేహితులతో ఆనందోత్సాహాలతో పండగను జరుపుకుంటారు. ఇక సెలబ్రెటీలు కూడా ఎంత బిజీగా ఉన్నా పనులన్నీ పక్కకు పెట్టి.. ఈ మూడురోజులు కుటుంబానికే కేటాయిస్తారు. సినీసెలబ్రెటీలు కూడా షూటింగ్ కు విరామం ప్రకటించి తమ ఫ్యామిలీ తో పండగను వైభవంగా జరుపుకుంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కుటుంబంకూడా ఒకే చోటకు చేరి సంబరంలా జరుపుకుంటారు.

కొడుకులు, అల్లుళ్లు, కూతుళ్లతో కలిసి ఎంతో ఆనందంగా సంక్రాంతిని జరుపుకుంటున్నారు చిరంజీవి. అయితే ఈసారి వేడుకల్లో అనుకోని అతిధి కనిపించారు. ఆయనే అక్కినేని నాగార్జున. చిరు నాగ్ ల మధ్యనే కాదు. వారి కుటుంబాల మధ్య కూడా మంచి స్నేహసంబంధాలున్న సంగతి తెలిసిందే. కొణిదెల వారింట ఈసారి జరుగుతున్న సంబరాలు వెరీవెరీ స్పెషల్ గా మారాయి. ఓ వైపు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నీహారిక, చైతన్య దంపతులకు ఇదే తొలి పండగ.. తొలి సంక్రాంతి. ఇక మరోవైపు నాగ్ దీంతో మెగా ఫ్యామిలీ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పవచ్చు. హైద‌రాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ క‌చేరితో, రుచిక‌ర‌మైన ఫుడ్ ను ఆర‌గిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈ స్టార్ హీరోలు.

చిరంజీవి, నాగార్జున‌తోపాటు రాంచ‌ర‌ణ్, అల్లు శిరీష్, వ‌రుణ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసిపోయారు. సంక్రాంతి సంబురాల్లో భాగంగా చిరు-నాగ్, యువ హీరోలు ఇలా ఒకే ఫ్రేమ్ లో క‌నిపించేస‌రికి ఫాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: భారీ ధరకు అమ్ముడైన వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్.. పవన్ స్టామినా ఇది అంటున్న ఫ్యాన్స్