అదిరిపోయే టైటిల్‌తో రాబోతున్న గోపిచంద్

జయాపజాలను పక్కనపెడితే ఆచితూచి సినిమాలు చేసే హీరోలలో గోపిచంద్ ఒకరు. 2001లో ‘తొలివలుపు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఇప్పటివరకు 25 చిత్రాలలో నటించాడు. ప్రస్తుతం గోపిచంద్ తమిళ కొత్త దర్శకుడు తిరు దర్శకత్వంలో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటికీ.. గోపిచంద్‌కు చిన్న యాక్సిడెంట్ అవ్వడం వలన చిత్రీకరణ వాయిదా పడింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా తాజాగా ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:28 pm, Sun, 9 June 19
అదిరిపోయే టైటిల్‌తో రాబోతున్న గోపిచంద్

జయాపజాలను పక్కనపెడితే ఆచితూచి సినిమాలు చేసే హీరోలలో గోపిచంద్ ఒకరు. 2001లో ‘తొలివలుపు’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ఇప్పటివరకు 25 చిత్రాలలో నటించాడు. ప్రస్తుతం గోపిచంద్ తమిళ కొత్త దర్శకుడు తిరు దర్శకత్వంలో నటిస్తున్నాడు. అప్పుడెప్పుడో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనప్పటికీ.. గోపిచంద్‌కు చిన్న యాక్సిడెంట్ అవ్వడం వలన చిత్రీకరణ వాయిదా పడింది. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా తాజాగా ఈ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. దానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది.

కాగా స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మెహ్రీన్ నటిస్తోంది. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అయితే శౌర్యం తరువాత గోపిచంద్‌ వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. దీంతో ఈ మూవీతోనైనా మళ్లీ ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు.