యంగ్ లుక్‌లో రజనీ.. సూపర్ తలైవా అంటోన్న ఫ్యాన్స్
స్టైల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరన్న సినీ పరిశ్రమ ఎరిగిన సత్యం. ఆయన సాధారణంగా నిల్చున్నా అందులో ఓ స్టైల్ ఉంటుంది. కాగా ఈ స్టైల్‌కు తోడు రాను రాను యవ్వనంగా తయారవుతున్నాడు సూపర్‌స్టార్. ఈ ఏడాది వచ్చిన పేటాలో యంగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రజనీ.. ఇప్పుడు నటిస్తోన్న దర్బార్‌లో అలాగే కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో రజనీ ఉండగా.. ఆయనను ఫొటో తీసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దాన్ని సోషల్ మీడియాలో […]
స్టైల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరన్న సినీ పరిశ్రమ ఎరిగిన సత్యం. ఆయన సాధారణంగా నిల్చున్నా అందులో ఓ స్టైల్ ఉంటుంది. కాగా ఈ స్టైల్‌కు తోడు రాను రాను యవ్వనంగా తయారవుతున్నాడు సూపర్‌స్టార్. ఈ ఏడాది వచ్చిన పేటాలో యంగ్ లుక్‌లో దర్శనమిచ్చిన రజనీ.. ఇప్పుడు నటిస్తోన్న దర్బార్‌లో అలాగే కనిపించబోతున్నాడు. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో రజనీ ఉండగా.. ఆయనను ఫొటో తీసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Rajini Sir with his grandson – the only candid pics on my i phone ? they were watching the monitor ? pic.twitter.com/XMyWV4Uh6R
— SantoshSivanASC. ISC (@santoshsivan) June 8, 2019
దానికి ‘‘మనవడితో రజనీ కాంత్ సర్. నా ఐఫోన్లో ఉన్న అద్భుత ఫొటో ఇది. రజనీ సర్ మానిటర్‌ను చూస్తున్నప్పుడు తీసిన ఫొటో’’ అంటూ కామెంట్ పెట్టాడు. ఇక ఈ ఫొటోకు రజనీ అభిమానులు ‘‘వాహ్వా సూపర్‌స్టార్’’.. ‘‘వావ్ తలైవా’’.. ‘‘తలైవా మీరు సూపర్’’ అంటూ తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. కాగా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న దర్బార్‌లో రజనీ సరసన నయనతార నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.