AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress : నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సొంత ఇల్లు కూడా లేదు.. సీరియల్ బ్యూటీ కామెంట్స్..

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీనటులు చాలా మంది ఉన్నారు. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ఓ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తనకు చెన్నైలో ఎలాంటి ఆస్తులు లేవు అని.. కనీసం సొంత ఇల్లు కూడా లేదని.. కేవలం స్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉందని తెలిపింది. ఇంతకీ ఆమె ఎవరు తెలుసు.

Serial Actress : నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సొంత ఇల్లు కూడా లేదు.. సీరియల్ బ్యూటీ కామెంట్స్..
Deepika Rangaraju
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2026 | 9:38 AM

Share

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు దీపికా రంగరాజు. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తనదైన నటనతో తెలుగు అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. అయితే టీవీలో పలు షోలలో తన అల్లరితో, వాక్చాతుర్యంతో సందడి చేస్తుంది. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆమె పంచుకున్న మాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. సాధారణంగా సెలబ్రిటీల జీవితాలు అనగానే అందరూ లగ్జరీ, ఇళ్లు, కార్లు ఊహించుకుంటారు. కానీ, ఈ ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడిన మాటలు జీవితం అసలైన పరమార్ధాన్ని, ప్రాముఖ్యతను గుర్తుచేశాయి. ఇంటర్వ్యూలో భాగంగా “మీకు సడన్ గా ఒక కోటి రూపాయలు దొరికితే ఏం చేస్తారు?” అని అడిగిన ప్రశ్నకు దీపికా ఎంతో నిజాయితీగా సమాధానమిచ్చారు. తనకు చెన్నైలో ఒక సొంత ఇల్లు (Own House) కొనాలనేది పెద్ద కల అని ఆమె చెప్పారు.

అయితే, ప్రస్తుతానికి తనకు ఎలాంటి సొంత స్థలం కానీ, ఇల్లు కానీ లేవని ఆమె స్పష్టం చేశారు. “ఈ ప్రపంచంలో మనం పుట్టినప్పుడే భగవంతుడు లేదా ప్రభుత్వం మనకంటూ ఒక స్థలాన్ని కేటాయిస్తుంది. అది మరేదో కాదు… మనం చనిపోయిన తర్వాత స్మశానవాటికలో (Graveyard) లభించే ఆరు అడుగుల స్థలం (6 Feet / 36 Square Feet)” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. నేను కోట్లల్లో సంపాదించడంలేదు.. లక్షల్లోనే సంపాదిస్తున్నా. నాకు క్రేజ్, పాపులారిటీ బ్రహ్మముడి సీరియల్ వల్లే వచ్చింది అని అన్నారు. మనిషి బ్రతికున్నంత కాలం ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని కలలు కన్నా, చివరికి శాశ్వతంగా మనకంటూ మిగిలేది ఆ ఆరు అడుగుల నేల మాత్రమేనని ఆమె చాలా సరళంగా వివరించారు

ఈ వ్యాఖ్యలు విన్న నెటిజన్లు, ప్రేక్షకులు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వాన్ని, జీవితంలో ఆస్తుల కంటే మనశ్శాంతి, బంధాలు ఎంత ముఖ్యమో దీపికా అందరికీ గుర్తుచేశారు. బ్రహ్మాముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ చెన్నై సుందరి.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..

దీపిక రంగరాజు పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..

Follow Us
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి..బంగారం ఎంత తగ్గిందో తెలిస్తే..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
నాకు స్మశానంలో 6 అడుగుల స్థలం మాత్రమే ఉంది..
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చారా? 5 నిమిషాల్లో రెడీ అయ్యే రెసిపీ
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
ఆసీస్‌కే దడ పుట్టించినోడిపై కన్నేసిన 3 ఐపీఎల్ టీంలు..!
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
నాటుకోడి కూర వివాదం.. తండ్రి ప్రాణాలు బలి, కొడుకు కటకటాల పాలు
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌..ఎందుకో తెలిస్తే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
నేరేడు పండ్లు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే..
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా!
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
చుక్క నూనె లేకుండా .. ఏడాది పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..
10 ఏళ్ల కలకు ఆ ఒక్కటే అడ్డు.. మరో చరిత్రకు సిద్ధమైన లేడీ రోహిత్..