AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Updates: కేవలం 3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి.. బంగారంపై రూ.17 వేలు..!

Gold Price Updates: ప్రస్తుత స్థాయిలలో దూకుడుగా కొనుగోలు చేయడానికి బదులుగా, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు SIPల ద్వారా గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టాలని పెట్టుబడి నిపుణుడు డాక్టర్ రవి సలహా ఇచ్చారు. ఈ సమయంలో గోల్డ్ బీస్ లేదా SIPల ద్వారా బంగారంలో..

Gold Price Updates: కేవలం 3 నెలల్లో రూ.50 వేలు తగ్గిన వెండి.. బంగారంపై రూ.17 వేలు..!
Gold, Silver Rates
Subhash Goud
|

Updated on: Jun 11, 2026 | 10:21 AM

Share

Gold, Silver Prices Updates: గత మూడు నెలలుగా బంగారం ధరలలో చాలా హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. బంగారం, వెండి ధరలు మరోసారి గణనీయంగా పడిపోయాయి . మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా బలమైన ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేట్లపై కఠిన వైఖరి నేపథ్యంలో విలువైన లోహాలపై ఒత్తిడి పెరిగింది. దీని ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ నుంచి భారత దేశీయ మార్కెట్ వరకు స్పష్టంగా కనిపిస్తోంది.

గత మూడు నెలల్లో తులం బంగారం ధర భారీగా తగ్గుముఖం పట్టింది. మార్చి 11వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,63,310 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,700 వద్ద కొనసాగుతోంది. అదే వెండి విషయానికొస్తే కిలో వెండి ధర అప్పుడు రూ.2,90,000 దాటింది. అదే ప్రస్తుతం అంటే జూన్‌ 11న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,640 వద్ద ట్రేడవుతోంది. అంటే గత మూడు నెలల్లో బంగారం ధర సుమారు 17,670 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,33,500 వద్ద కొనసాగుతోంది. అంటే ఈ 22 క్యరెట్ల ధరపై రూ.16,200 తగ్గింది. ఇక వెండి విషయానికొస్తే ప్రస్తుతం రూ.2,49,900 వద్ద కొనసాగుతుంది. ఇది మూడు నెలల్లో కిలో వెండిపై ఏకంగా 50 వేల రూపాయల వరకు దిగి వచ్చింది.

ఇది కూడా చదవండి: Home Loan: ఈ చిన్న ట్రిక్‌తో మీ హోమ్‌ లోన్‌పై రూ.6.85 లక్షల వరకు వడ్డీ ఆదా..!

ఇవి కూడా చదవండి

గత 3 నెలల్లో బంగారంపై రాబడి ఎంత?

దేశీయ ఫ్యూచర్స్ ధరల విషయానికి వస్తే, MCX ఎక్స్ఛేంజ్‌లో మార్చి 9, 2026న 10 గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.168,350 వద్ద ముగిసింది. జూన్ 9, 2026నతో పరిశీలిస్తే.. ఈ ధర 10 గ్రాములకు రూ.152,443 వద్ద ముగిసింది. ఈ విధంగా మూడు నెలల్లో బంగారం ధర రూ.15,907 మేర పడిపోయింది. అంతేకాకుండా, గత నెలలో బంగారం ప్రతికూల రాబడులను కూడా అందించింది.

ఇప్పుడు పెట్టుబడి పెట్టాలా వద్దా?

ప్రస్తుత స్థాయిలలో దూకుడుగా కొనుగోలు చేయడానికి బదులుగా, దీర్ఘకాలిక పెట్టుబడిదారులు SIPల ద్వారా గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టాలని పెట్టుబడి నిపుణుడు డాక్టర్ రవి సలహా ఇచ్చారు. ఈ సమయంలో గోల్డ్ బీస్ లేదా SIPల ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం సరైన వ్యూహం అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ బంగారం ధర రూ.140,000 స్థాయికి పడిపోతే ఆ సమయంలో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చని కూడా ఆయన తెలిపారు. అనిశ్చితి సమయాల్లో బంగారం ఎల్లప్పుడూ ఒక బలమైన ఆస్తిగా నిలుస్తుందని ఆయన జోడించారు.

ఇది కూడా చదవండి: Indian Mangoes: భారత మామిడి పండ్ల దిగుమతిని నిషేధించిన నేపాల్‌.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!

ఇది కూడా చదవండి: Gold Price: ఇలాంటి మంచి రోజులు వస్తాయని మీరెప్పుడైనా ఊహించారా? భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో