AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటుకోడి కూర ఎంత పని చేసింది.. తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు..

జనగామ జిల్లా అక్కరాజుపల్లి గ్రామంలో నాటుకోడి కూర విషయంలో ప్రారంభమైన కుటుంబ కలహం విషాదాంతమైంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో జోక్యం చేసుకున్న కుమారుడు గణేష్, క్షణికావేశంలో తండ్రి రమేష్‌పై రోకలి బండతో దాడి చేయగా, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు.

నాటుకోడి కూర ఎంత పని చేసింది.. తండ్రిని దారుణంగా హత్య చేసిన కొడుకు..
Chicken
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jun 11, 2026 | 8:56 AM

Share

జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన ఒక కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టింది. నాటుకోడి కూర విషయంలో ప్రారంభమైన కుటుంబ కలహం చివరకు తండ్రి మృతికి, కొడుకు అరెస్టుకు దారితీసింది. గ్రామానికి చెందిన రైతు జంగిలి రమేష్ మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో నాటుకోడిని తీసుకువచ్చి కూర వండాలని తన భార్య అనూషను కోరాడు. అయితే అప్పటికే చేపల కూర వండినట్లు తెలిపిన ఆమె, రాత్రి వేళ కావడంతో మరో కూర వండడం కష్టమని చెప్పింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

వివాదం తీవ్రరూపం దాల్చడంతో రమేష్ తన భార్యను దుర్భాషలాడడంతో పాటు ఆమెపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తల్లిదండ్రుల మధ్య గొడవను ఆపేందుకు వారి కుమారుడు గణేష్ జోక్యం చేసుకున్నాడు. తన తల్లిని ఎందుకు తిడుతున్నారని తండ్రిని ప్రశ్నించడంతో తండ్రి-కొడుకుల మధ్య కూడా ఘర్షణ నెలకొంది. ఆగ్రహానికి లోనైన రమేష్ తన కుమారుడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో క్షణికావేశానికి గురైన గణేష్, పక్కనే ఉన్న రోకలి బండతో తండ్రి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రమేష్ రక్తస్రావంతో కుప్పకూలగా, కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం ఆయన మృతి చెందాడు. మృతుడి సోదరుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తండ్రిపై దాడి చేసిన గణేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

చిన్న కుటుంబ వివాదంగా మొదలైన ఈ ఘటన క్షణికావేశం కారణంగా విషాదాంతమై, ఒక కుటుంబాన్ని తీరని దుఃఖంలోకి నెట్టింది. తండ్రి ప్రాణాలు కోల్పోగా, కుమారుడు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us