AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#BoyCottBollywood: సుశాంత్‌ని చంపింది వారే.. నెటిజన్ల ట్వీట్ల వెల్లువ

బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకొని కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

#BoyCottBollywood: సుశాంత్‌ని చంపింది వారే.. నెటిజన్ల ట్వీట్ల వెల్లువ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 15, 2020 | 5:46 PM

Share

బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం ఆత్మహత్య చేసుకొని కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతితో సినీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎంతో కష్టపడి స్టార్ నటుడిగా ఎదిగిన సుశాంత్, అర్థాతంరంగా తనువు చాలించడం సెలబ్రిటీలతో పాటు సామాన్యులను బాధపడేలా చేసింది. మరోవైపు ఆయన ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇదిలా ఉంటే సుశాంత్‌ మృతిపై ఆయన ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు ఇప్పుడు ట్వీట్ చేస్తున్నారు. బాలీవుడ్‌లో ఉన్న నెపోటిజం(వారసత్వం) కారణంగానే సుశాంత్ మరణించాడని వారు ట్వీట్లు చేస్తున్నారు.

కెరీర్ ప్రారంభంలోనే పీకే, ఎంఎస్ ధోని వంటి చిత్రాలతో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న సుశాంత్‌కి వరుస ఆఫర్లు వస్తాయని అందరూ భావించారు. కానీ ఆయన కెరీర్ అందరూ ఊహించినంతగా సాగలేదు. దానికి తోడు ఆయన ఒప్పుకున్న కొన్ని చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఏ ఇబ్బందులు లేనప్పటికీ ఆయన నటించిన ‘డ్రైవ్’ చిత్రం నేరుగా ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలో విడుదలైంది. అంతేకాదు బాలీవుడ్‌లోని కొన్ని బడా నిర్మాణ సంస్థలు సుశాంత్‌కి ఆఫర్లు లేకుండా చేసినట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. వీటన్నింటితో పాటు బాలీవుడ్‌ తనను హీరోగా గుర్తించడం లేదని సుశాంత్ కూడా పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌నే సుశాంత్ మరణానికి కారణమని, ఇకపై బాలీవుడ్ సినిమాలను బాయ్‌కాట్ చేస్తామంటూ పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అవార్డు ఫంక్షన్‌లోనూ ఆయనను సరిగా ట్రీట్ చేయలేదని వీడియోలు పెడుతున్నారు. దీంతో #boycottbollywood హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.

Read This Story Also: అది వారి కర్మ.. సుశాంత్ మృతిపై బాలీవుడ్‌ దర్శకుడి సంచలన ట్వీట్

ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?