Twinkle Khanna: దీపికాకు మద్దతుగా ట్వింకిల్ ఖన్నా.. డేటింగ్ ట్రోలింగ్స్ పై కౌంటర్..

భర్త కంటే ముందు పలువురితో ప్రేమలో పడ్డ విషయాన్ని బయటపెట్టింది దీపికా. అంతేకాకుండా రణవీర్ సింగ్ పరిచయమయ్యాక కూడా చాలామందిని కలిశానని.. ఎవరు తనకు కనెక్ట్ కాలేదని.. కానీ రణ్వీర్ మాత్రమే సరైన జోడీ అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే రణ్వీర్ పరిచయమయ్యాక ఇతరులతో డేటింగ్ చేసిన సమయంలో రణ్వీర్ ప్రేమలో లేనట్లు తెలిపింది దీపికా. కానీ కేవలం దీపికా ట్రోలింగ్ గురించి మాట్లాడం వీడియోను షేర్ చేస్తూ.. అంతకు ముందు దీపికా చెప్పిన కామెంట్లతో పోలుస్తూ ట్రోలింగ్ చేశారు.

Twinkle Khanna: దీపికాకు మద్దతుగా ట్వింకిల్ ఖన్నా.. డేటింగ్ ట్రోలింగ్స్ పై కౌంటర్..
Twinkle Khanna, Deepika Pad
Follow us

|

Updated on: Nov 21, 2023 | 7:26 AM

బాలీవుడ్ పవర్ ప్యాక్ట్ కపుల్ దీపికా పదుకొనే, రణ్వీర్ ఇటీవల కాఫీ విత్ కరణ్ సీజన్ 8లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షోలో దీపికా మాట్లాడిన మాటలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ నడిచింది. ముఖ్యంగా భర్త కంటే ముందు పలువురితో ప్రేమలో పడ్డ విషయాన్ని బయటపెట్టింది దీపికా. అంతేకాకుండా రణవీర్ సింగ్ పరిచయమయ్యాక కూడా చాలామందిని కలిశానని.. ఎవరు తనకు కనెక్ట్ కాలేదని.. కానీ రణ్వీర్ మాత్రమే సరైన జోడీ అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే రణ్వీర్ పరిచయమయ్యాక ఇతరులతో డేటింగ్ చేసిన సమయంలో రణ్వీర్ ప్రేమలో లేనట్లు తెలిపింది దీపికా. కానీ కేవలం దీపికా ట్రోలింగ్ గురించి మాట్లాడం వీడియోను షేర్ చేస్తూ.. అంతకు ముందు దీపికా చెప్పిన కామెంట్లతో పోలుస్తూ ట్రోలింగ్ చేశారు. తాజాగా దీపికాకు మద్దతు తెలిపింది సీనియర్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా.

ట్వింకిల్ తన బ్లాగ్ లో ఇలా రాసుకొచ్చింది..”డియర్ ఆంటీస్, అంకుల్స్ అలాగే అంతగా అర్హతలేని బ్యాచిరల్స్.. దీపికా తన కాబోయే భర్తతో డేటింగ్ చేస్తూనే ఇతర పురుషులతో డేటింగ్ చేసింది అని తను చెప్పలేదు. కానీ ఆమె మాటలపై ట్రోలింగ్ చేయడం విస్మయం కలిగిస్తోంది. కానీ దీపికా ఆలోచన చాలా మంది మహిళలను అనవసర వ్యక్తులను వివాహం చేసుకోకుండా కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. నేను కష్టమైన సంబంధాలను వదులుకున్నాను. కొంతకాలం పాటు ఒంటరిగా ఉండాలని కోరుకున్నాను. నేను ఎవరికీ అటాచ్ కావాలనుకోలేదు. కానీ ఆ దశను దాటాను.

మనం సోఫా కొనడానికి వెళ్లినప్పుడు ఏది సౌకర్యవంతగా .. మంచిగా ఉంటుందో అది కొనడానికి ఆసక్తి చూపిస్తాము. అలా కాబోయే భర్త విషయంలోనూ అంతే. అయినా దీపికా మాటలను తప్పుగా చూస్తున్నాను. నేను ఆమె నిర్ణయం చాలా సరైనదని భావిస్తున్నాను. ఇలా చేయడం వల్ల చాలా మంది స్త్రీలు మోసపోకుండా కాపాడవచ్చు” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.