Vivek Agnihotri: అక్షయ్ కుమార్ ‘ఓమైగాడ్ 2’కు ‘A’ సర్టిఫికెట్.. సెన్సార్ బోర్డుపై ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ సంచలన కామెంట్లు
అక్షయ్ కుమార్ నటించిన 'OMG 2' సెన్సార్ బోర్డ్ అనేక మార్పులను సూచించడంతో పాటు 'A' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నిర్ణయం సరైనది కాదని వివేక్ అగ్నిహోత్రి సెన్సార్ బోర్డును తప్పుబట్టారు. కాగా అగ్నిహోత్రి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో కూడా భాగం. అయినా కూడా ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఇటీవల తన కామెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో ఆయన పాపులారిటీ బాగా పెరిగింది. ప్రస్తుతం ‘ది వ్యాక్సిన్ వార్’ అనే మరో పాన్ ఇండియా సినిమాతో రానున్నాడు. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారిపోయాడు వివేక్. సినిమాల గురించే కాకుండా విభిన్న అంశాల గురించి కూడా తన ఆలోచనలను పంచుకోవడం ప్రారంభించారు. తాజాగా ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. సెన్సార్ బోర్డు అవసరం ఏంటని ప్రశ్నించారు . అలాగే సినిమాల్లో ద్వేషపూరిత ప్రసంగాలను అనుమతించాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్షయ్ కుమార్ నటించిన ‘OMG 2’ సెన్సార్ బోర్డ్ అనేక మార్పులను సూచించడంతో పాటు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ నిర్ణయం సరైనది కాదని వివేక్ అగ్నిహోత్రి సెన్సార్ బోర్డును తప్పుబట్టారు. కాగా అగ్నిహోత్రి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో కూడా భాగం. అయినా కూడా ఆయన ఇలాంటి ప్రకటన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సినిమాలను బహిష్కరించకూడదు..
‘నేను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో భాగమైనప్పటికీ, నేను దానిని వ్యతిరేకిస్తున్నాను. సెన్సార్ బోర్డు ఉండకూడదు. సినిమాలను బహిష్కరించడం, బ్యాన్ చేయడాన్ని నేను కూడా వ్యతిరేకిస్తాను. నేను వాక్‌స్వేచ్ఛను నమ్ముతాను. ద్వేషపూరిత ప్రసంగాలను కూడా అనుమతించాలి. సినిమా నిర్మాతల ఉద్దేశం ఏమిటి? వివేక్ అగ్నిహోత్రి ఉద్దేశం చెడ్డది కాకపోతే, దానిని కొనసాగించనివ్వండి’ అని పేర్కొన్నారు వివేక్ అగ్నిహోత్రి. కాగా వివేక్ అగ్నిహోత్రి ప్రస్తుతం ‘ది వ్యాక్సిన్ వార్’ సినిమా చేస్తున్నాడు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో ‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, వివేక్ అగ్నిహోత్రి ‘ది కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్’ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. దీని ట్రైలర్ కొద్ది రోజుల క్రితం విడుదలై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇది జీ5 OTT లో ఇవాళ్టి నుంచే స్ట్రీమింగ్ కానుంది.




అక్షయ్ కుమార్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
