Siddharth Shukla: సిద్ధార్థ్ శుక్లా మరణం వెనుక మిస్టరీ.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలని పూర్తి రీజన్.. నెక్ట్స్ హిస్టోపథాలజీ

నటుడు సిద్ధార్థ్ శుక్లా మరణం వెనుక పలు ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. సిద్ధార్థ్ శుక్లా నిజంగానే హార్ట్ ఎటాక్ తో మరణించాడా? లేక సూసైడ్ చేసుకున్నాడా?....

Siddharth Shukla: సిద్ధార్థ్ శుక్లా మరణం వెనుక మిస్టరీ.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలని పూర్తి రీజన్.. నెక్ట్స్ హిస్టోపథాలజీ
Sidharth Shukla
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 03, 2021 | 2:57 PM

బిగ్ బాస్ ఫేమ్, టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా డెత్ మిస్టరీ కలకలం రేపుతోంది. సిద్ధార్థ్ శుక్లా నిజంగానే హార్ట్ ఎటాక్ తో మరణించాడా? లేక సూసైడ్ చేసుకున్నాడా? సిద్ధార్ధ్ పోస్టుమార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది. అటాస్పీలో ఏం తేలింది? ఇంతకీ, సిద్ధార్థ్ శుక్లా డెత్ వెనుకున్న మిస్టరీ ఏంటి? అంటూ అతడి సన్నిహితులు, అభిమానులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ముంబై కూపర్ ఆస్పత్రిలో సిద్ధార్థ్ శుక్లా డెడ్ బాడీకి పోస్టుమార్టం జరిగింది. అటాప్సీ రిపోర్ట్ కూడా వచ్చేసింది. అయితే, పోస్టుమార్టం అండ్ అటాప్సీ రిపోర్ట్స్‌లో సిద్ధార్థ్ మృతికి కారణాలేంటో గుర్తించలేకపోయారు. శరీరం బయటా లోపలా ఎలాంటి గాయాల్లేవని వైద్యులు తేల్చారు. ప్రాథమిక సమాచారం మేరకు కార్డియాక్ అరెస్ట్ తోనే సిద్ధార్థ్ మరణించినట్లు ప్రకటించారు. దాంతో, అతని మృతికి అసలు కారణమేంటో తేలకుండా పోయింది.

మరి, సిద్ధార్థ్ శుక్లా డెత్ మిస్టరీ గుట్టు వీడేదెలా? మరో మార్గం లేదా అంటే… ఉందంటున్నారు వైద్యులు. హిస్టోపథాలజీతో గుట్టు విప్పొచ్చంటున్నారు. ఇంతకీ, హిస్టోపథాలజీ అంటే ఏమిటి? ఇదొక కెమికల్ అనాలసిస్. కీలక ఆర్గాన్స్ ను కెమికల్ అనాలసిస్ చేస్తే సిద్ధార్థ్ డెత్ మిస్టరీ వీడిపోనుంది. అందుకే, సిద్ధార్థ్ శుక్లా ఆర్గాన్స్ ను కెమికల్స్ లో భద్రత పర్చినట్లు కూపర్ హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి.

ప్రాథమిక సమాచారం మేరకు సిద్ధార్ధ్ గుండెపోటుతో మరణించాడని వైద్యులు చెబుతున్నా… కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్స్ అనేక అనుమానాలు రేపుతున్నాయ్. ఇంతకీ, శుక్లా ఫ్యామిలీ చెప్పిన సీక్రెట్స్ ఏంటి? శుక్లా మరణానికి ముందు రాత్రి అసలేం జరిగింది?

సిద్ధార్ధ్ నిద్రపోయే ముందు టాబ్లెట్స్ వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిడ్ నైట్ మూడు గంటల సమయంలో గుండెలో ఇబ్బంది ఉందని చెప్పడంతో మంచినీళ్లు ఇచ్చినట్లు శుక్లా తల్లి తెలిపింది. ఆ తర్వాత మళ్లీ నిద్రలోకి వెళ్లిపోయాడు శుక్లా. కానీ, శుక్లా, ఎప్పటిలాగా నిద్ర లేవలేదు. తల్లి వెళ్లి చూసేసరికి చలనం లేకుండా పడివున్నాడు. ఎంత ప్రయత్నించినా లేవకపోవడంతో ఉదయం 10గంటల సమయంలో కూపర్ ఆస్పత్రికి తరలించారు. తీసుకెళ్లిన కాసేపటికే శుక్లా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

Also Read: బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్

అన్ని శాఖల్లోనూ అవినీతి.. ఏపీని కుదిపేస్తోన్న నకిలీ చలాన్ల కుంభకోణం

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?