బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర, హీరోయిన్ కియారా అద్వానీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబసభ్యులు.. అతికొద్ది మంది సన్నిహితులు.. సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. షేర్షా సినిమాతో తెరపై మాయ చేసిన ఈ బ్యూటీఫుల్ జోడీ.. ఇప్పుడు నిజజీవితంలో దంపతులుగా మారారు. వీరి పెళ్లికి రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ప్యాలెస్ వేదిక అయ్యింది. గత మూడు నాలుగు రోజులుగా వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. వీరి వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు హజరయ్యారు. అంతేకాదు.. అతిథులను రిసీవ్ చేసుకోవడం కోసం ఏకంగా 70 లగ్జరీ కార్లను నిర్వహాకులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. సిద్ధార్థ్, కియారా పెళ్లికి రోజుకు దాదాపు రూ. 2 కోట్లు ఖర్చయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఖరీదైన పెళ్లి వేడుకలలో వీరిది ఒకటి. ఎట్టకేలకు ఫిబ్రవరి 7న ఈ ప్రేమపక్షులు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అయితే వీరి పెళ్లికి వచ్చే అతిథులకు ఫోన్ ఉపయోగించేందుకు అనుమతి లేదని సమాచారం.
షేర్షా సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరు పలుమార్లు కలుసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక గత కొద్ది రోజులుగా వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు తెగ వైరలయ్యాయి. అయితే వీరిద్దరితోపాటు.. సినీ ప్రముఖులు ఎవరూ కూడా ఈ జంట పెళ్లి గురించి స్పంధించకపోవడం కూడా గమనార్హం. అయితే అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లిలో వంటలు చేయడానికి ముంబయి, ఢిల్లీ నుంచి దాదాపు 500 మంది వెయిటర్లను.. వంట చేసేవారిని రప్పించారట. ఈరోజు రాత్రి జరగనున్న బరాత్ కార్యక్రమంలో కియారా.. సిద్ధార్థ్ వివాహ వేడుకలు ముగియబోతున్నాయి. వీరి పెళ్లి వేదికకు సంబంధించిన ఫోటోస్.. వీడియోస్ తెగ వైరలవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కియారా అద్వానీ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆర్సీ 15 చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈసినిమాను తెలుగుతోపాటు… మలయాళం, కన్నడ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో కియారాతోపాటు.. శ్రీకాంత్, అంజలి కీలకపాత్రలలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.