AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్‌ షఫాలీ మృతికి కారణం గుండె పోటు కాదా? ఇంట్లో దొరికిన ఆ ఇంజెక్షన్లు

‘కాంటా లగా’ సాంగ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న షఫాలీ జరీవాలా ఆకస్మిక మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. కొన్ని సినిమాల్లోనూ నటించిన ఆమె 42 ఏళ్లకే కన్నుమూయడం సినిమా ప్రియులను కలచి వేస్తోంది. కాగా షఫాలీ మృతిపై పోలీసుల విచారణ జరుగుతోంది.

Shefali Jariwala: ‘కాంటా లగా’ ఫేమ్‌ షఫాలీ మృతికి కారణం గుండె పోటు కాదా? ఇంట్లో దొరికిన ఆ ఇంజెక్షన్లు
Shefali Jariwala
Basha Shek
|

Updated on: Jun 29, 2025 | 1:46 PM

Share

‘కాంటా లగా’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి షఫాలీ జరివాలా ఆకస్మిక మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2002 సమయంలో వచ్చిన ఈ సాంగ్‌ తో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయింది షఫాలీ. దీని తర్వాత కొన్ని సినిమాలు, బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ సందడి చేసింది. అలాగే సోషల్ మీడియాలోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అయితే జూన్ 27న షఫాలీ ఉన్నట్లుండి కన్నుమూసింది. కార్డియాక్ అరెస్ట్ తోనే ఆమె చనిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ముంబై పోలీసులు దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. షఫాలీ జరివాలా మరణించిన వెంటనే, ముంబై పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కూపర్ ఆసుపత్రికి పంపారు. శవపరీక్ష నిర్వహించినప్పటికీ, మరణానికి గల అసలు కారణం గురించి వారు ఇంకా వెళ్లడించలేదు. తదుపరి వైద్య విశ్లేషణ కోసం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమిక దర్యాప్తులో మాత్రం షఫాలీ మరణానికి కొన్ని వైద్యపరమైన కారణాలు ఉండవచ్చని తెలుస్తోంది

షఫాలీ జరీవాలా ఎప్పటికీ అందంగా ఉండాలనే కోరికే ఆమె ప్రాణం మీదకు తీసుకొచ్చిందిని తెలుస్తోంది. ఇందుకోసం నటి చాలా సంవత్సరాలుగా యాంటీ ఏజింగ్‌ ఇంజెక్షన్లు తీసుకుంటుందని సమాచారం. ఇందుకు సంబంధించిన మెడిసిన్స్ తో కొన్ని ఇంజెక్షన్లను షఫాలీ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక శుక్రవారం ఇంట్లో కొన్ని పూజా కార్యక్రమాలు ఉండడంతో ఉదయం నుంచి షఫాలీ ఉపవాసంతో ఉందని తెలుస్తోంది. ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్‌కు సంబంధించిన ఇంజెక్షన్‌ తీసుకోవడంతోనే కార్డియాక్‌ అరెస్టై ఉంటారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇంజెక్షన్‌ తీసుకున్న తర్వాత షఫాలీ పరిస్థితి ఆందోళనగా మారిందని, ఆమె శరీరం అంతా బాగా వణికిపోయిందని ఆపై స్పృహ కోల్పోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అయితే పోస్ట్‌మార్టం, ల్యాబ్ నివేదికలను విశ్లేషించిన తర్వాత మరణానికి తుది కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

షఫాలీ లాస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ఇదే..

అయితే షఫాలీ తీసుకుంటోన్న యాంటి ఏజింగ్ చికిత్సకు ఆమె ఆరోగ్యంతో ఎటువంటి సంబంధం లేదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా షెఫాలి బాగా తెలిసిన ఓ ప్రముఖ వైద్యుల దగ్గర ట్రీట్ మెంట్ తీసుకుంటోందని పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..