Salman Khan: పాపం ఫోటోతో బుక్కయిపోయిన సల్లూ భాయ్.. రాచిరంపాన పెడుతున్న నెటిజన్స్

టోక్యో ఒలంపిక్స్‌‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అదరగొట్టి.. దేశానికి రజత పతకం తీసుకువచ్చిన మీరా భాయ్ చాను.. తన ఫేవరెట్ హీరోని...

Salman Khan: పాపం ఫోటోతో బుక్కయిపోయిన సల్లూ భాయ్.. రాచిరంపాన పెడుతున్న నెటిజన్స్
Salman Khan Trolled
Follow us

|

Updated on: Aug 12, 2021 | 7:20 PM

టోక్యో ఒలంపిక్స్‌‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో అదరగొట్టి.. దేశానికి రజత పతకం తీసుకువచ్చిన మీరా భాయ్ చాను.. తన ఫేవరెట్ హీరోని కలుసుకుంది. ఇంతకీ చానుకి అభిమాన హీరో ఎవరనుకుంటున్నారు.. మన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.  కాగా.. తాజాగా.. చాను సల్మాన్‌ని కలిసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా.. ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. సల్మాన్ తో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసి.. తన ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చానుకి సల్లూ భాయ్ కూడా ట్విట్టర్ వేదిక అభినందనలు తెలియజేశారు. ఆమెను కలవడం చాలా ఆనందంగా ఉందంటూ బెస్ట్ విషెస్ తెలియజేశారు. ఇంతవరకూ ఓకే కానీ.. ఈ ఫోటోలలో సల్మాన్ ఖాన్ మెడలో ఓ కండువా ధరించి కనిపించారు. ఆ కండువాపై ‘జింక’ ఉండటం నెటిజన్లు గమనించారు. అంతే కాదు దాన్ని మీరాబాయి చాను బహుకరించినట్లుగా భావించారు. ఇంకేముంది.. సల్లూ భాయ్‌కి సరైన గిఫ్ట్ ఇచ్చావంటూ ట్రోల్ చేస్తున్నారు. సల్మాన్‌ కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. ఫన్నీ కామెంట్స్ పెడుతూ నెట్టింట హోరెత్తిస్తున్నారు.

1998లో వచ్చిన ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ షూటింగ్ సమయంలో కంకణి వద్ద సల్మాన్‌ కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 1998 అక్టోబర్ 2న అటవీ శాఖ కేసు ఫైల్ చేసింది. సల్మాన్ ఖాన్‌పై వన్యప్రాణి చట్టం సెక్షన్ 51 కింద కేసు నమోదు చేయగా.. మిగిలిన వారిపై ఐపీసీ సెక్షన్ 149 కింద అభియోగాలు మోపారు. మొత్తం ఏడుగురిని నిందితులుగా చేర్చారు. వేటాడిన సమయంలో సల్మాన్‌తో పాటు ఉన్న సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, టబు, నీలమ్‌ సహా దుష్యంత్ సింగ్, దినేష్ గౌరే పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. అంతేకాకుండా నలుగురు వ్యక్తులను ప్రత్యక్ష సాక్ష్యులుగా పేర్కొన్నారు. ఆ తరవాత 2000 నవంబర్ 9 నుంచి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో పలు కోర్టులు మారిన కేసు.. చాలా మలుపులు తీసుకుంది. చివరిగా జోధ్ పూర్ కోర్టు నిందిలందరికీ రిలీఫ్ ఇచ్చినప్పటికీ, సల్మాన్‌ను శిక్షించాలని పిటిషన్స్ మాత్రం ఆగడం లేదు.

Also Read:ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క లిక్కర్ బాటిల్ తెచ్చేందుకు కూడా అనుమతి లేదు.. ఏపీ సర్కార్ క్లారిటీ

ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్‌పై ట్విస్ట్… హైకోర్టుకు వెళ్లిన వ్యవహారం