Mega Brother Nagababu: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు .. పవన్ కళ్యాణ్ ఫోటోని మిస్ చేసిన నాగబాబు.. ఫీలవుతున్న ఫ్యాన్స్

Mega Brother Nagababu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయం కృషితో హీరోగా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో చిరు వేసిన బాటలో దాదాపు పదిమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి ట్యాగ్ లైన్ తో టాలీవుడ్ లో అడుగు..

Mega Brother Nagababu: ఒకే ఫ్రేమ్‌లో మెగా హీరోలు .. పవన్ కళ్యాణ్ ఫోటోని మిస్ చేసిన నాగబాబు.. ఫీలవుతున్న ఫ్యాన్స్
Chiranjeevi
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 12, 2021 | 11:07 AM

Mega Brother Nagababu: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో స్వయం కృషితో హీరోగా ఎదిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో చిరు వేసిన బాటలో దాదాపు పదిమంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి ట్యాగ్ లైన్ తో టాలీవుడ్ లో అడుగు పెట్టినా తమకంటూ సొంత శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు మెగా హీరోలు. చిరంజీవి వారసుడిగా మొదటి టాలీవుడ్ లో అడుగు పెట్టిన హీరో పవన్ కళ్యాణ్. అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటె.. పవన్ కు మాత్రం భక్తులు ఉంటారు. అంతగా అభిమానిస్తారు పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు.

దీంతో పవన్ కళ్యాణ్ విషయంలో ఏ చిన్న విషయమైనా ఎక్కువగా ఆలోచిస్తారు.. ఓ రేంజ్ ఓ స్పందిస్తారు. మెగా ఫ్యామిలీ ఈవెంట్ లో పవన్ రాకపోయినా ఆయన ప్రస్తావన తీసుకుని రాకపోయినా అక్కడ పవన్ ఫ్యాన్స్ చేసే రచ్చ రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఓ సారి మెగా బ్రదర్ నాగబాబు ఇదే విషయంపై పబ్లిక్ గా మండిపడిన సంగతి అందరి మదిలో ఇంకా ఉంది. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటో షేర్ చేశాడు.

ఆ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి మధ్యలో ఉండగా.. చుట్టూ మెగా హీరోలందరూ ఉన్నారు. ఆ ఫోటో ని షేర్ చేస్తూ.. నాగబాబు ఈ పిక్ లో ఉన్న మెగా హీరోల్లో అందరికంటే మీరే యంగ్ గా కనిపిసున్నారు అంటూ కామెంట్ జత చేశాడు. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన జనరేషన్ కానీ, రాబోయే జనరేషన్‌లో కానీ ఎవరూ మిమ్మల్ని బీట్ చేయలేరు అన్నయ్యా అంటూ తనకు అన్న చిరంజీవి పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు.. అయితే నాగబాబు షేర్ చేసిన ఈ ఫొటోలో రామ్ చరణ్ , అల్లు అర్జున్, వరుణ్ తేజ్ , సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ లు ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మిస్ అయ్యాడు . దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.

తమ హీరోని ఎందుకు మిస్ చేశారు అంటూ నాగబాబు పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. మరికొందరు నాగ‌బాబు మ‌న‌సులో త‌న త‌మ్ముడు కూడా ఇంకా యంగ్‌గా ఉన్నాడని భావిస్తున్నట్టున్నాడు అందుకే ఫొటో మిస్ చేశాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

Also Read: వినాయక చవితి కానుకగా థియేటర్స్‌లో సందడి చేయడానికి రెడీ అవుతున్న సినిమాలు