Salman Khan : సినీకార్మికులకు అండగా సల్మాన్ ఖాన్. ఏకంగా 25 వేల మంది కార్మికులకు..
కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెద్ద హీరోనే కాదు పెద్ద మనసున్న వ్యక్తి కూడా.. తన చుట్టూ ఉన్నవారికోసం ఆలోచించడంలో సల్మాన్ ముందుంటాడు.
Salman Khan : కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెద్ద హీరోనే కాదు పెద్ద మనసున్న వ్యక్తి కూడా.. తన చుట్టూ ఉన్నవారికోసం ఆలోచించడంలో సల్మాన్ ముందుంటాడు. కరోనా కష్టకాలంలో ఎంతోమందికి సల్మాన్ భాయ్ సాయం అందించాడు. సెకండ్ వేవ్ ఎఫెక్ట్‌తో షూటింగ్‌లు ఆగిపోయాయి. దీంతో స్టార్స్ అంతా ఇంటికే పరిమితమయ్యారు. చాలా మంది కరోనా విషయంలో అవేర్‌నెస్ కలిగించటంతో పాటు కోవిడ్ అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ బాలీవుడ్ కండల వీరుడు మాత్రం ఫీల్డ్‌లో దిగి మరి సాయం చేస్తున్నారు లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలోనూ తన వంతు సాయంగా భారీ విరాళం ప్రకటించిన సల్మాన్ ఖాన్… ఇటీవల స్వయంగా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. కోవిడ్ వారియర్స్ కోసం ఈ మధ్య ప్రత్యేకంగా వంట చేయించి వారికి అందజేశాడు. తన సొంత రెస్టారెంట్ చైన్ `భాయ్‌జాన్ కిచెన్` ద్వారా ఈ సర్వీస్ చేస్తున్నారు సల్మాన్. రోజు ముంబైలోని 5000 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కు భాయ్‌జాన్ కిచెన్ నుంచి ఫుడ్ అందేలా ఏర్పాట్లు చేశారు.
తాజాగా సల్మాన్ సినీకార్మికుల కోసం మరో అడుగు ముందుకు వేశారు. సల్మాన్ ప్రతి కార్మికుడికి నెలవారీ 1,500 రూపాయలు చెల్లించనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ తివారి తెలిపారు. సల్మాన్ ఖాన్ నుంచి నిన్ననే విషయం తెలిసిందని… 25 వేల మంది కార్మికులకు నెలకు 1,500 రూపాయలతో సహాయం చేస్తానని ఆయన తెలిపారని… త్వరలోనే సినిమాకార్మికుల జాబితాను మేము సల్మాన్ కు పంపుతామని ప్రెసిడెంట్ తివారి అన్నారు. అయితే FWICE లో జూనియర్ ఆర్టిస్టులు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ మెన్, స్పాట్బాయ్స్ మరియు టెక్నీషియన్లతో సహా మొత్తం 2.5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఇక సల్మాన్ అందిస్తున్న సాయం పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చదవండి :