Kangana Ranaut : కరోనా బారినపడిన కాంట్రవర్సీ క్వీన్.. కంగనాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ..

కరోనా మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలంతా కరోనా వ్యాప్తితో ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య

Kangana Ranaut : కరోనా బారినపడిన కాంట్రవర్సీ క్వీన్.. కంగనాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ..
kangana ranaut
Follow us

|

Updated on: May 08, 2021 | 12:09 PM

Kangana Ranaut: కరోనా మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలంతా కరోనా వ్యాప్తితో ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకు కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఫస్ట్ వేవ్ ను మించి సెకండ్ వేవ్ లో వైరస్ బారిన పడుతున్నవారిసంఖ్య అధికంగా ఉంది. మరో వైపు సినిమా తారలు , రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడటం మరింత ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే పలువురు సినీపరిశ్రమకు చెందిన వారు కోవిడ్ బారిన పడ్డారు. కొంతమంది సినీ దిగ్గజాలు కరోనా కారణంగా కన్నుమూశారు కూడా..ఎవ్వరినీ ఈ కరోనా వదిలిపెట్టడంలేదు. ఇక బాలీవుడ్ లో సినిమాతారలు ఒకొక్కరు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే దీపికాపడుకొనే, శిల్పా శెట్టి లాంటివారు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ కు కుడా కరోనా సోకింది .

ఈ విషయాన్ని కంగనా స్వయంగా తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆమె టెస్ట్ చేయించుకున్నారు. దాంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కంగనా సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు రాజకీయనాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేసింది కంగనా. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ అకౌంట్ శాశ్వతంగా తొలగించింది ట్విట్టర్ యాజమాన్యం. ఇక కంగనాకు కరోనాగా నిర్దారణ అయిన తరవాత ఆమె సెల్ఫ్ ఐసొలేషన్స్ కు వెళ్లారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమె జయలలిత జీవిత కథతో తెరకెక్కుతున్న తలైవి సినిమాలో నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

Director Trivikram: పెద్ద డీల్ ఇది..! మహేష్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనున్న గురూజీ..

Natural star Nani: అర్రెర్రే.. పెద్ద సమస్యే వచ్చిందే..! నాని బాలీవుడ్ ఆశకు అదే అడ్డంకి గా మారిందట…

Amitabh Bachchan: కరోనాని లెక్కచేయని మొండిఘటం.. కేబీసీని కంటిన్యూ చేయనున్న బిగ్ బి..