AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natural star Nani: అర్రెర్రే.. పెద్ద సమస్యే వచ్చిందే..! నాని బాలీవుడ్ ఆశకు అదే అడ్డంకి గా మారిందట…

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాను చేస్తున్నపుడు.

Natural star Nani: అర్రెర్రే.. పెద్ద సమస్యే వచ్చిందే..! నాని బాలీవుడ్ ఆశకు అదే అడ్డంకి గా మారిందట...
Rajeev Rayala
|

Updated on: May 08, 2021 | 1:24 PM

Share

Natural star Nani:

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలను పట్టాలెక్కిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాను చేస్తున్నప్పుడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా  ఉంది ఈ సినిమా ఈ సినిమాలో రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమా తర్వాత టాక్సీ వాల ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా శ్యామ్ సింగరాయ్ అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి , ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అధితిరావు హైదరి నటిస్తున్నారు.

అయితే ఇప్పటికే చాలా మంది హీరోలు తమ మార్కెట్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. పాన్ ఇండియా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది డైరెక్ట్ గా బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. అయితే నానికి కూడా బాలీవుడ్ కు వెళ్లాలని ఉందట కానీ ఓ సమస్య కారణంగా వెళ్లలేక పోతున్నాడట. అదేంటంటే బాలీవుడ్ సినిమా చేయకపోవడానికి హిందీ భాషే దానికి ప్రతిబంధకంగా మారిందని తెలిపాడు. బాలీవుడ్‌లో నటించాలని ఉన్నా.. హిందీ రాకపోవడం సమస్యగా మారిందని పేర్కొన్నాడు. తాను హిందీ మాట్లాడగలనని… కానీ ఆ హిందీ సినిమా చేసేందుకు సరిపోదని చెప్పుకొచ్చాడు నాని. నాని సినిమాల విషయానికి వస్తే.. కరోనా కారణంగా ‘టక్ జగదీష్’ రిలీజ్ దగ్గరికి వచ్చి ఆగిపోగా.. అంటే సుందరానికి, శ్యామ్ సింఘరాయ్ షూటింగులు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Amitabh Bachchan: కరోనాని లెక్కచేయని మొండిఘటం.. కేబీసీని కంటిన్యూ చేయనున్న బిగ్ బి..

Vamshi Paidipally: ఇద్దరు స్టార్ హీరోలను హ్యాండిల్ చేయడం అంటే సాహసమనే చెప్పాలి…!

Mamatha Mohandas: చాలా కాలం తరువాత తిరిగి సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్న ముద్దుగుమ్మ..