AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamatha Mohandas: చాలా కాలం తరువాత తిరిగి సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్న ముద్దుగుమ్మ..

చాలా మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ లో కొంత కాలం ఓ వెలుగు వెలిగి ఆతర్వాత కనుమరుగవుతూ ఉంటారు.. మళ్లీ ఎప్పటికో రీఎంట్రీ అంటూ తిరిగి సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు.

Mamatha Mohandas: చాలా కాలం తరువాత తిరిగి సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్న ముద్దుగుమ్మ..
Rajeev Rayala
|

Updated on: May 08, 2021 | 8:22 AM

Share

mamatha mohandas: చాలా మంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ లో కొంత కాలం ఓ వెలుగు వెలిగి ఆతర్వాత కనుమరుగవుతూ ఉంటారు.. మళ్లీ ఎప్పటికో రీఎంట్రీ అంటూ తిరిగి సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. ఇప్పటికే అలా వచ్చి ఇలా వెళ్లిన భామలు తిరిగి సినిమాల్లో బిజీ అవ్వడాన్ని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలాగే ఈ బ్యూటీ కూడా రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందట. యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అందాల భామ మమతా మోహన్‌ దాస్. గ్లామర్ ప్లస్ టాలెంట్‌తో సిల్వర్‌ స్క్రీన్ ను షేక్ చేసిన ఈ బ్యూటీ సడన్‌గా కనుమరుగయ్యారు. హెల్త్ ఇష్యూస్‌ కారణం గ్లామర్‌ ఫీల్డ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్న ఈ బ్యూటీ.. క్యాన్సర్‌తో పోరాడి గెలిచారు.

తిరిగి సిల్వర్ స్క్రీన్ మీద సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్న మమతా తనలోని గ్లామర్ యాంగిల్‌కు మరోసారి పదును పెడుతున్నారు. తాజాగా అరుణ్ మాథ్యు అనే ఫోటో గ్రాఫర్‌తో కలిసి ఓ హాట్‌ ఫోటో షూట్‌ చేశారు. ఎక్కువగా నెగెటివ్‌ టచ్‌ ఉన్న రోల్స్‌లోనే నటించిన ఈ బ్యూటీ ఫోటో షూట్‌లోనూ అదే థీమ్‌ను ఫాలో అయ్యారు.

రీఎంట్రీలో ఫుల్ స్వింగ్‌లో ఉన్న మమతా వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు. తన మదర్‌ టంగ్ మలయాళంలోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. గత ఏడాది కేవలం ఒకే ఒక్క సినిమా చేసిన ఈ బ్యూటీ చేతిలో… ఇప్పుడు ఏకంగా పది సినిమాలు ఉన్నాయంటేనే మమత ఏ రేంజ్‌లో బౌన్స్‌ బ్యాక్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

View this post on Instagram

A post shared by Mamta Mohandas (@mamtamohan)

మరిన్ని ఇక్కడ చదవండి :

Nagarjuna: మరో బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న మన్మధుడు.. బంగార్రాజు కోసం ఆ భామ..

Thank You Movie: షూటింగ్ పూర్తిచేసుకున్న థ్యాంక్యూ టీం.. చైతో సెల్ఫీని షేర్ చేసిన రాశిఖన్నా..

కరోనా బారిన పడ్డ శిల్పాశెట్టి కుటుంబం.. మా ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..