కరోనా బారిన పడ్డ శిల్పాశెట్టి కుటుంబం.. మా ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..

Shilpa Shetty: దేశంలో కరోనా విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ వైరస్ ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. అటు సినీ ప్రముఖులు కూడా వైరస్ బారిన పడ్డారు.

కరోనా బారిన పడ్డ శిల్పాశెట్టి కుటుంబం.. మా ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..
Shilpa Shetty Family
Follow us
Rajitha Chanti

|

Updated on: May 07, 2021 | 7:55 PM

Shilpa Shetty: దేశంలో కరోనా విజృంభణ కోనసాగుతూనే ఉంది. ఈ వైరస్ ఏ ఒక్కరిని వదిలిపెట్టడం లేదు. అటు సినీ ప్రముఖులు కూడా వైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే కుటుంబం మొత్తం కరోనా బారిన పడగా.. తాజాగా మరో హీరోయిన్ శిల్పాశెట్టి కుటుంబానికి కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని శిల్పాశెట్టి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా‏లో వెల్లడించారు. ఆమె భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమిషా, వియాన్ రాజ్ కుంద్రాలతోపాటు.. ఆమె అత్తమామలు, తల్లి సునంద కరోనా బారిన పడ్డారు. కేవలం వీరు మాత్రమే కాకుండా.. శిల్పాశెట్టి ఇంట్లో పనిచేసే మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్‏గా నిర్ధారణ అయినట్లుగా తెలిపారు.

ఈమేరకు ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతా‏లో ఎమోషనల్ పోస్ట్ చేశారు. గత పది రోజులుగా మా కుటుంబానికి చాలా కష్టంగా ఉంది. నా అత్తమామలకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత సమిషా, వియాన్రాజ్, మా అమ్మకు.. చివరకు రాజ్ కు కరోనా సోకింది. వీరంత అధికారిక మార్గదర్శకాల ప్రకారం ఇంట్లో వారి వారి గదులలో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. డాక్టర్ సలహాను అనుసరిస్తున్నారు. మా ఇంటి సిబ్బందిలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. వారు కూడా చికిత్స తీసుకుంటున్నారు.దేవుని దయ వలన ప్రతి ఒక్కరూ కోలుకునే దశలో ఉన్నారు. నాకు మాత్రం నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రోటోకాల్ ప్రకారం అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నాము. త్వరగా స్పందించి సత్వర సహాయం అందించినందుకు బిఎంసి అధికారులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. దయచేసి మీ ప్రార్థనలలో మా అందరినీ కొనసాగించండి. మాస్క్ ధరించండి, సురక్షితంగా ఉండండి. కరోనా పాజిటివ్ వచ్చినా రాకపోయినా సానుకూలంగా ఉండండి అంటూ పోస్ట్ చేసింది శిల్పాశెట్టి. ఇక ఈ విషయం తెలుసుకున్న పలువురు బాలీవుడ్ ప్రముఖులు శిల్పా కుటుంబం త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు.

ట్వీట్..

Also Read: Adipurush: మకాం మార్చిన ఆదిపురుష్ టీం.. ఇక పై షూటింగ్ అంతా అక్కడే.. అసలు కారణం అదే..

కరోనా కష్టకాలంలో సల్మాన్ ఖాన్ టీం పెద్దమనసు.. ‘రాధే’ సినిమా వసూళ్లను అలా ఉపయోగించనున్నారట..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!