Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: మకాం మార్చిన ఆదిపురుష్ టీం.. ఇక పై షూటింగ్ అంతా అక్కడే.. అసలు కారణం అదే..

Adipurush Movie Update: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా..

Adipurush: మకాం మార్చిన ఆదిపురుష్ టీం.. ఇక పై షూటింగ్ అంతా అక్కడే.. అసలు కారణం అదే..
Adipurush
Follow us
Rajitha Chanti

|

Updated on: May 07, 2021 | 6:20 PM

Adipurush Movie Update: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ఆదిపురుష్. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతీ సనన్ సీతగా నటిస్తోంది. అలాగే పవర్ ఫుల్ రావణ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నా ఈ సినిమాను టీ సిరీస్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‏తో నిర్మిస్తోంది. అయితే ఇప్పటివరకు సినిమా షూటింగ్ మొత్తం ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్‏లో జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇకపై హైదరాబాద్ లోనే జరగబోతుందట. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది. కరోనా ప్రభావం మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల్లో ఎక్కువగానే ఉంది. దీంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దీంతో పలు సినిమా షూటింగ్స్ ఆగిపోవాల్సి వచ్చింది. ఇక ఈ సమయంలోనే ఆదిపురుష్ తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో జరపాలని నిర్ణయించుకున్నారట మేకర్స్. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలు కూడా ప్రారంభించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక అనుకున్నట్లుగా అన్ని జరిగితే.. వచ్చే వారంలోనే హైదరాబాద్ లో ‘ఆదిపురుష్’ కొత్త షెడ్యూల్ ఆరంభం అవుతుందట. ఈ షెడ్యూల్ లో పాల్గొనటానికి ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీఖాన్ అంగీకరించారట. వాస్తవానికి ఈ పాన్ ఇండియా చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. షూటింగ్ లో మెజారిటీ భాగం ఇండోర్ లోనే ఉంటుంది. అందుకే పక్కాగా జాగ్రత్త తీసుకుంటే ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితిలోనూ షూటింగ్ చేయడం సమస్య కాదని భావిస్తోంది యూనిట్. ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాలో కన్నడ హీరో సుదీప్ ఓ పాజిటివ్ రోల్‏లో నటిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. సుదీప్ విభీషణుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం.

Also Read: బాలకృష్ణకు జోడీగా పవన్ హీరోయిన్.. మరోసారి లక్కీ హీరోయిన్‏కే ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..

పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..