బాలకృష్ణకు జోడీగా పవన్ హీరోయిన్.. మరోసారి లక్కీ హీరోయిన్‏కే ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..

Balakrishna: లాక్ డౌన్ అనంతరం థియోటర్ల ఓపెన్ అయిన కొద్దిరోజుల్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది క్రాక్. ఇక ఈ సినిమాను కరోనా టైమ్‏లో

బాలకృష్ణకు జోడీగా పవన్ హీరోయిన్.. మరోసారి లక్కీ హీరోయిన్‏కే ఛాన్స్ ఇవ్వనున్న డైరెక్టర్..
Balakrishna
Follow us
Rajitha Chanti

|

Updated on: May 07, 2021 | 2:22 PM

Balakrishna: లాక్ డౌన్ అనంతరం థియోటర్ల ఓపెన్ అయిన కొద్దిరోజుల్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది క్రాక్. ఇక ఈ సినిమాను కరోనా టైమ్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. ఇక ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని తన తదుపరి సినిమా ఎవరితో తీయబోతున్నాడనే చర్చలు జరిగాయి. ఈ క్రమంలో గోపిచంద్ మలినేని.. బాలకృష్ణతో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ డైరెక్టర్ తో.. నందమూరి బాలకృష్ణ చేయబోతున్న మూవీపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ రివీల్ అయ్యింది. చాలాకాలం తర్వాత బాలకృష్ణను ఫ్యాక్షనిస్టుగా చూడబోవడమే కాదు.. అందాలతారతో సీమసింహం స్క్రీన్ షేర్ చేసుకోనున్నారట. ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటితో.. హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’ షూటింగ్ లో బిజీగా ఉన్న బాలకృష్ణ.. తన నెక్ట్స్ మూవీ గోపిచంద్ మలినేనితో చేస్తున్నారు. ఇప్పటికే క్రాక్ తో హిట్ కొట్టిన గోపిచంద్.. బాలయ్యకు కథ చెప్పడం.. దాన్ని ఓకే చేయడం చకచకా అయిపోయింది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షనిస్టు పాత్రలో నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది.

సమరసింహారెడ్డి నుంచి ఫ్యాక్షన్ పాత్రలో తన హీరోయిజాన్ని చూపించారు.. బాలకృష్ణ. ఇక ఆ మళ్ళీ చాలాకాలం తర్వాత మరోసారి అదే పాత్రలో కనిపించబోతున్నాడు. యధార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం ఉండబోతుందని.. టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడని సమాచారం. అయితే అందులో ఒకటి ఫ్యాక్షన్ లీడర్, మరోకటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. అయితే అందులో ఒకరిని శ్రుతిహాసన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గోపిచంద్ కు శ్రుతిహాసన్ లక్కీహీరోయిన్. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో బలుపు, క్రాక్ మూవీలు వచ్చాయి. ఈ రెండూ హిట్ అయ్యాయి. దీంతో బాలకృష్ణ మూవీలో కూడా శ్రుతిహాసన్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం శ్రుతిహాసన్.. ప్రభాస్ సరసన.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాలో నటిస్తోంది.

Also Read: పెళ్ళి చేసుకున్న పాపులర్ కమెడియన్స్.. 9 రోజుల తర్వాత షాకిచ్చిన పోలీసులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..

రెండో పెళ్లిపై స్పందించిన నటి సురేఖా వాణి.. మనసున్న వాడు కాదు… డబ్బున్న వాడు కావాలి అంటూ..