Nagarjuna: మరో బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న మన్మధుడు.. బంగార్రాజు కోసం ఆ భామ..

కింగ్ నాగార్జునకు గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లు ఎదురవుతున్నాయి. ఇటీవల వైల్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్.

Nagarjuna: మరో బాలీవుడ్ బ్యూటీతో రొమాన్స్ చేయనున్న మన్మధుడు.. బంగార్రాజు కోసం ఆ భామ..
Nagarjuna
Follow us
Rajeev Rayala

|

Updated on: May 08, 2021 | 7:22 AM

Nagarjuna:

కింగ్ నాగార్జునకు గత కొంతకాలంగా వరుస ఫ్లాప్ లు ఎదురవుతున్నాయి. ఇటీవల వైల్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్. ఈ సినిమా కాస్త పర్వాలేదు అనిపించినా ఆశించిన స్థాయిలో విజయం మాత్రం అందుకోలేకపోయింది. ఆతర్వాత ఓటీటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డ్ వ్యూస్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. అయితే నాగ్ నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా సూపర్  హిట్ అయినా విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు నాగ్ . అయితే ఈ సినిమా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.  నాగార్జున బంగార్రాజు సినిమా చేస్తున్నాడని ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. సోగ్గాడే చిన్నినాయనలో  నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు క్యారెక్టర్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. కానీ ఈ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. త్వరలోనే ఈ సినిమాను మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు నాగార్జున. తాజాగా ఈ మూవీకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

బాలీవుడ్‌లో దబాంగ్‌ సినిమాతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న హీరోయిన్‌ సోనాక్షి సిన్హా. బాలీవుడ్‌లో పలు హిట్‌ సినిమాల్లో నటించింది సోనాక్షి. కానీ, గత కొంతకాలంగా సరైన సినిమాలు లేక సతమతం అవుతుంది. ఈక్రమంలోనే ఈ అమ్మడికి తెలుగులో అడుగుపెట్టే ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. బంగార్రాజు సినిమాలో నాగార్జునతో నటించడానికి చిత్రయూనిట్ ఆమెను సంప్రదించారని తెలుస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anushka: క‌రోనా బాధితుల్లో ధైర్యం నింపే ప్ర‌యత్నం చేస్తోన్న జేజ‌మ్మ‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్వీటీ పాజిటివ్ పోస్ట్‌..

RGV Tweet: చోట రాజ‌న్ మ‌ర‌ణ వార్త‌పై త‌న‌దైన శైలిలో స్పందించిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌.. అంత‌లోనే నిజం తెలుసుకొని..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!