AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka: క‌రోనా బాధితుల్లో ధైర్యం నింపే ప్ర‌యత్నం చేస్తోన్న జేజ‌మ్మ‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్వీటీ పాజిటివ్ పోస్ట్‌..

Anushka Instagram: క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఏ వార్త ప‌త్రికా చూసినా, ఏ న్యూస్ ఛాన‌ల్ ట్యూన్ చేసినా క‌రోనాకు సంబంధించిన వార్త‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌ర‌ణాలు సంఖ్య‌, పెరుగుతోన్న కేసుల వివ‌రాలు..

Anushka: క‌రోనా బాధితుల్లో ధైర్యం నింపే ప్ర‌యత్నం చేస్తోన్న జేజ‌మ్మ‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో స్వీటీ పాజిటివ్ పోస్ట్‌..
Anushka Instagram
Narender Vaitla
|

Updated on: May 08, 2021 | 5:57 AM

Share

Anushka Instagram: క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. ఏ వార్త ప‌త్రికా చూసినా, ఏ న్యూస్ ఛాన‌ల్ ట్యూన్ చేసినా క‌రోనాకు సంబంధించిన వార్త‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. మ‌ర‌ణాలు సంఖ్య‌, పెరుగుతోన్న కేసుల వివ‌రాలు ఇలా అన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేసే అంశాలే. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్రతీ ఒక్క‌రూ కాస్త సానుకూల దృక్ఫ‌థంతో స్పందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా వేదిక‌గా పాజిటివ్ పోస్ట్‌లు చేస్తూ క‌రోనా బాధితుల్లో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో అందాల తార అనుష్క వ‌చ్చి చేరారు. ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే స‌మ‌యంలో అంద‌రిలో ధైర్యాన్నినింపుతూ.. ‘ఈ విప‌త్క‌ర స‌మ‌యం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ప్ర‌తీ ఒక్క‌రూ వారి శ‌క్తి మేర ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక‌రి స‌హాయం మ‌రొక‌రి ఎంత‌గానో అవ‌స‌ర‌ముంది కాబ‌ట్టి ఐక్యమ‌త్యంతో ఒక‌రికి ఒక‌రం స‌హాయ‌ప‌డ‌దాం. ఈ స‌మ‌యంలో అందరూ క్షేమంగా ఉండడానికి తగిన జాగ్రత్తలు పాటించాల‌ని కోరుకుంటున్నాను. ఎవ‌రికి వారు ఇంట్లో స్వీయ నిర్బంధంతో ఉండండి.. మీకు కావాల్సిన వారి కోసం దూరంగా ఉంటూనే స‌మ‌యాన్ని కేటాయించండి. క‌రోనా భ‌యాన్ని పొగోట్టుకోవ‌డానికి శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయండి. సానుకూల దృక్ప‌థం పెంచే ప‌నులు చేయండి. అందరం కలిస్తే ఇలాంటి మ‌హ‌మ్మారిని జ‌యించ‌డం క‌ష్ట‌మేమి కాదు’ అంటూ సుధీర్ఘంగా రాసుకొచ్చారు స్వీటీ. ఎక్క‌డ చూసినా నెగిటివ్ వార్త‌లు వ‌స్తోన్న వేళ అనుష్క చెప్పిన ఈ పాజిటివ్ మాటలు చాలా బాగున్నాయి క‌దూ..

అనుష్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌..

Also Read: కరోనా బారిన పడ్డ శిల్పాశెట్టి కుటుంబం.. మా ఫ్యామిలీకి చాలా కష్టంగా ఉందంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Adipurush: మకాం మార్చిన ఆదిపురుష్ టీం.. ఇక పై షూటింగ్ అంతా అక్కడే.. అసలు కారణం అదే..

Follow Us
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
ప్రతిరోజు ఒక్క గ్లాస్ తాగితే ఉక్కులాగా ఆరోగ్యంగా ఉంటారు..
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
వరమహాలక్ష్మి వ్రతానికి ఈ రంగు చీరలే ఎందుకు ప్రత్యేకమో తెలుసా?
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
కొత్త పింఛన్లపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన..
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
అగ్నివీర్‌గా 'రేసు గుర్రం' విలన్ కూతురు.. ప్రముఖుల ప్రశంసలు
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ వచ్చేసింది
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
ప్లాస్టిక్ కుర్చీలు మురికిగా మారాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయ్!
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!