AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ -5 ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసా..? ఆసక్తి పెంచుతున్న షోపై మరో అప్‌డేట్‌

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ షో.. దీని గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్‌ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. గ..

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ -5 ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసా..? ఆసక్తి పెంచుతున్న షోపై మరో అప్‌డేట్‌
Bigg Boss Telugu Season 5
Subhash Goud
|

Updated on: May 08, 2021 | 12:10 PM

Share

Bigg Boss Telugu: బిగ్‌బాస్‌ షో.. దీని గురించి తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మొదటి సీజన్‌ నుంచి ఈ షో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. గత నాలుగు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు ఐదో సీజన్‌ ప్రారంభం అయ్యేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ షోలో ఉండే కంటెస్టెంట్లు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా సీజన్ ప్రారంభం అవుతున్న సమయంలో టీవీల ముందు వాలిపోయేలా చేస్తుంది. ఎందుకంటే ఎవరికైనా అవతలి వారు నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవడానికి.. అది కూడా సెలబ్రిటీలు ఎలా ఉంటారో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

అయితే ప్రస్తుతం ఐదో సీజన్‌ కోసం పనులను దాదాపు పూర్తికావచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో సీజన్ 4 ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. ఇక దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి 5వ సీజన్ ప్రారంభించాలనుకున్నారు. అలాగే ఐదో సీజన్‌ కోసం కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌ ఇండస్ట్రీ సెలబ్రిటీలను కాకుండా.. సోషల్ మీడియా నుండి గుర్తింపు పొందిన సెలబ్రెటీలను తీసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ -5వ సీజన్ గురించి ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు మరో అప్ డేట్ వచ్చింది.

నిజానికి ఈ సీజన్‌ను జూన్‌ నెలలో నిర్వహించాలని నిర్వాహకులు భావించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేస్తూ ఆలస్యంగా ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో షోను ప్రారంభించడం సరైనది కాదని, కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తుండగా, తాజాగా ఆగస్టు నెలలో ఈ షోను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉండగా, జాగ్రత్తలు తీసుకుని షోను కొనసాగించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు పరిస్థితులు కుదుటపడితేనే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సీజన్ 5ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం.  కాగా, ఈ సారి కూడా షోకు నాగార్జున‌నే హోస్ట్‌గా ఉంటార‌ని తెలుస్తుంది.

ఇవీ కూడా చదవండి:

Kangana Ranaut : కరోనా బారినపడిన కాంట్రవర్సీ క్వీన్.. కంగనాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ..

Natural star Nani: అర్రెర్రే.. పెద్ద సమస్యే వచ్చిందే..! నాని బాలీవుడ్ ఆశకు అదే అడ్డంకి గా మారిందట…