Charmme and Trisha : త్రిష పెళ్లి పై పంజాబీ భామ క్లారిటీ.. కొత్త డిస్కషన్‌కు తెర లేపిన ఛార్మి..

ఒక్క స్టేట్మెంట్‌తో కొత్త డిస్కషన్‌కు తెర లేపారు పంజాబీ భామ ఛార్మి కౌర్‌. రీసెంట్‌గా త్రిష బర్త్ డే సందర్భంగా ఛార్మి చేసిన ట్వీట్

Charmme and Trisha : త్రిష పెళ్లి పై పంజాబీ భామ క్లారిటీ.. కొత్త డిస్కషన్‌కు తెర లేపిన ఛార్మి..
Charmi

Charmme and Trisha : ఒక్క స్టేట్మెంట్‌తో కొత్త డిస్కషన్‌కు తెర లేపారు పంజాబీ భామ ఛార్మి కౌర్‌. రీసెంట్‌గా త్రిష బర్త్ డే సందర్భంగా ఛార్మి చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్‌లలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది త్రిష లాస్ట్ బ్యాచిలర్‌ బర్త్‌ డే అంటూ చార్మీ కామెంట్ చేయటంతో, చెన్నై చంద్ర పెళ్లికి రెడీ అవుతున్నారా? అన్న చర్చ మొదలైంది.

అయితే త్రిష పెళ్లి గురించి ఛార్మి కామెంట్‌ చేయటం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు… 2019లోనూ త్రిష పెళ్లి గురించి ఫన్నీ ట్వీట్ చేశారు ఛార్మి. `నన్ను పెళ్లి చేసుకుంటావా త్రిషా` అంటూ ఛార్మి చేసిన కామెంట్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. మరోసారి త్రిష పెళ్లి మ్యాటర్ ఛార్మి సైడ్‌ నుంచి రావటంతో సీరియస్‌గా తీసుకోవాలా వద్దా.. అర్ధం కావటం లేదంటున్నారు ఫ్యాన్స్‌.

పౌర్ణమి సినిమాలో కలిసి నటించిన ఈ హీరోయిన్స్‌ కింగ్ మూవీలోనూ ఓ సాంగ్‌లో కలిసి డ్యాన్స్ చేశారు. సో… అప్పటి నుంచి ఈ అందాల భామల మధ్య మంచి స్నేహం కుదిరింది. అందుకే త్రిష బర్త్‌ డే రోజు ఇలా సరదాగా కామెంట్స్‌తో ఎంటర్‌టైన్‌ చేస్తుంటారు ఛార్మి కౌర్‌. ఇక ఇప్పుడు త్రిష లాస్ట్ బ్యాచిలర్‌ బర్త్‌ డే ఇదే అంటూ ఛార్మి కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు ఛార్మి కూడా వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా సమీప బంధువును ఛార్మి పెళ్లాడబోతుందని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut : కరోనా బారినపడిన కాంట్రవర్సీ క్వీన్.. కంగనాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ..

Akshara Haasan: గ్లామ‌ర్ హ‌ద్దులు చెరిపేసిన అక్షర హాసన్‌.. తాజా ఫోటో షూట్ తో కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు

Director Trivikram: పెద్ద డీల్ ఇది..! మహేష్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనున్న గురూజీ..