AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhe movie: డిజిట‌ల్ లో మోత మోగిస్తున్న ‘రాధే’.. స‌ల్లూ భాయ్ స్ట్రాటజీ అదుర్స్.. సర్వ‌ర్స్ డౌన్

ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అంటూ ఇక్కడి బన్నీని, డీఎస్పీని ఆకాశానికెత్తేశారు సల్మాన్ ఖాన్. తన సినిమా కోసం ఇటువంటి త్యాగాలు చాలానే చేశారు. రిలీజ్ విషయంలో ధైర్యం చేసినట్లే పబ్లిసిటీలో కూడా దూకుడు పెంచేశారు.

Radhe movie: డిజిట‌ల్ లో మోత మోగిస్తున్న 'రాధే'.. స‌ల్లూ భాయ్ స్ట్రాటజీ అదుర్స్.. సర్వ‌ర్స్ డౌన్
Radhe Movie
Ram Naramaneni
|

Updated on: May 17, 2021 | 3:30 PM

Share

ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అంటూ ఇక్కడి బన్నీని, డీఎస్పీని ఆకాశానికెత్తేశారు సల్మాన్ ఖాన్. తన సినిమా కోసం ఇటువంటి త్యాగాలు చాలానే చేశారు. రిలీజ్ విషయంలో ధైర్యం చేసినట్లే పబ్లిసిటీలో కూడా దూకుడు పెంచేశారు. టైగర్ ష్రాఫ్ లాంటి కుర్ర హీరోల్ని కూడా పొగిడేశారు. ఇంత కష్టపడ్డందుకు తగిన ఫలితం కూడా దక్కింది సల్మాన్ కి. పైగా.. నా దారిలోకి మీరూ రండి అంటూ వెల్ కమ్ చేస్తున్నారు. ఆచార్య నుంచి అఖండ దాకా చాలామంది.. సల్మాన్ మాటను, రూటును సీరియస్ గా కన్సిడర్ చేస్తున్నారట. కోవిడ్ షాక్ తో ఏం చేయాలో తోచక సైలెంట్ మోడ్ లో వుండిపోయిన సినిమా ఇండస్ట్రీకి సరికొత్త హోప్స్ క్రియేట్ చేశారు హీరో సల్మాన్ ఖాన్. రిస్క్ చేస్తే చేశారు గాని.. తన రాధే మూవీని జనంలోకి తీసుకెళ్లడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఓవరాల్ రివ్యూ డల్ గా వున్నా, కంటెంట్ లో పస లేదని తేలిపోయినా.. డిజిటల్ వసూళ్లలో మాత్రం బెటర్ గా పెర్ఫామ్ చేస్తోంది రాధే మూవీ. అఫీషియల్ గా వినిపిస్తున్న ఫస్ట్ నంబర్స్ ఆశాజనకంగానే వున్నాయ్.

ఫాన్స్ అంతా ఒక్కసారిగా స్ట్రీమింగ్ కి పోటీ పడడంతో.. ఊహించినదాని కంటే ఎక్కువగా హిట్స్ వచ్చి సర్వర్‌లు హ్యాంగ్ అయ్యేదాకా వెళ్ళింది పరిస్థితి. ఒక స్టార్ హీరో సినిమాకు థియేటర్లోనే కాదు డిజిటల్ ద్వారా కూడా ఎంత హవా నడుస్తుందో ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసింది రాధే మూవీ. మొదటిరోజే 42 లక్షల వ్యూస్ దక్కించుకుని… పెట్టుబడిలో సగందాకా రాబట్టున్న రాధే.. ఇప్పుడు బాక్సాఫీస్ పండిట్స్ బుర్రలకు పని పెంచేసింది. పాన్ ఇండియా మార్కెట్ వున్న పెద్దపెద్ద సినిమాల స్ట్రాటజీల్ని కూడా మార్చేస్తోంది.

ప్లాప్ టాక్ తోనే ఇంత దండుకుంటే.. సూపర్ హిట్ టాక్ వస్తే ఎంత కలెక్ట్ చెయ్యొచ్చు? స్టార్ వ్యాల్యూ వున్న సినిమాకు డిజిటల్ రూట్ ఎందుకు బెటర్ సోర్స్ కాదు? అనే కాలిక్యులేషన్స్ మొదలయ్యాయి. నార్త్ లో ఇప్పటివరకూ డేట్స్ ఎనౌన్స్ చేసి థియేటర్ల కోసం వెయిట్ చేస్తున్న బిగ్ టికెట్ మూవీస్ ని పునరాలోచనలో పడేసింది రాధే రిజల్ట్. బెల్ బాటమ్ లాంటి కొన్ని సినిమాలైతే.. దాదాపుగా ఒక డెసిషన్ కొచ్చేశాయి. ఇటు.. సౌత్ లో సైతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘డిజిటల్ ఈజ్ ది బెస్ట్’ అనే థియరీ వర్కవుట్ అవుతోంది. 90 శాతం ప్రొడక్షన్ పూర్తయిన పెద్ద సినిమాలు కూడా మనమూ డేర్ చేస్తే పోలా.. అనే మూడ్ లోకొచ్చేశాయట.

Also Read: మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న సిల్వర్‌ స్క్రీన్ జేజ‌మ్మ‌..! ఏ సినిమాలో అంటే..

విజయ్‌ సేతుపతి బాలీవుడ్ ఎంట్రీకి వరుస అడ్డంకులు.. ఈసారి అయినా ఫేట్ మారేనా ..?

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!