Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు లేడీ రిపోర్టర్‌ పెళ్లి ప్రపోజల్‌.. కండల వీరుడి రిప్లై ఏంటో తెలుసా?

ఆరు పదుల వయసు దగ్గరికొచ్చినా ఇంకా సింగిల్‌ గానే లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నాడు సల్మాన్‌. గతంలో పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించిన అతను పెళ్లిపీటల దాకా మాత్రం వెళ్లలేకపోయాడు. దీంతో సల్మాన్‌ పెళ్లి చేసుకుంటాడా లేదా? ఒకవేళ చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు? అని నెట్టింట చర్చలు జరుగుతూనే ఉంటాయి.

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌కు లేడీ రిపోర్టర్‌ పెళ్లి ప్రపోజల్‌.. కండల వీరుడి రిప్లై ఏంటో తెలుసా?
Salman Khan
Follow us

|

Updated on: May 27, 2023 | 6:35 PM

సల్మాన్‌ ఖాన్‌.. సినిమా ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సూపర్‌ స్టార్‌కు బోలెడు మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఆరు పదుల వయసు దగ్గరికొచ్చినా ఇంకా సింగిల్‌ గానే లైఫ్‌ను లీడ్‌ చేస్తున్నాడు సల్మాన్‌. గతంలో పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించిన అతను పెళ్లిపీటల దాకా మాత్రం వెళ్లలేకపోయాడు. దీంతో సల్మాన్‌ పెళ్లి చేసుకుంటాడా లేదా? ఒకవేళ చేసుకుంటే ఎవరిని చేసుకుంటాడు? అని నెట్టింట చర్చలు జరుగుతూనే ఉంటాయి. కాగా తాజాగా సల్మాన్‌కు ఓ పెళ్లి ప్రపోజల్‌ వచ్చింది. లైవ్‌ ఓ లేడీ రిపోర్టర్‌ ‘నన్ను పెళ్లి చేసుకోండి’ అని అడిగింది. అయితే ఆ ప్రపోజల్‌ను సున్నితంగా తిరస్కరించిన సల్మాన్‌ తనకు ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు దాటిందన్నాడు. దుబాయ్‌ వేడుకగా జరుగుతున్న ఐఫా-2023 వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఐఫా-2023 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు బాలీవుడ్‌ తారలు ఈ ఈవెంట్‌కు తరలివచ్చారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సల్మాన్‌ మాట్లాడుతుండగా.. సడెన్‌గా ఓ లేడీ రిపోర్టర్ ప్రపోజ్‌ చేసింది. ‘సల్మాన్ మీ కోసమే నేను హాలీవుడ్ నుంచి వచ్చాను. మిమ్మల్ని చూసినప్పుడే నేను మీతో లవ్‌లో పడిపోయాను’ చెప్పింది. అమ్మాయి ప్రపోజల్‌ను విన్న సల్మాన్‌ ‘మీరు షారుఖ్‌ ఖాన్‌ గురించి మాట్లాడుతున్నారు కదా’ అంటూ తనదైన శైలిలో జోక్‌ వేశాడు. దీంతో ఆ రిపోర్టర్‌ ‘లేదు లేదు.. నేను మీ గురించే మాట్లాడుతున్నా.. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?’ అని మళ్లీ అడిగింది. దీంతో చివరకు సల్మాన్ ‘నాకు పెళ్లి వయసు దాటిపోయింది. 20 ఏళ్ల క్రితం నువ్వు నన్ను కలిసి ఉంటే బాగుండేది’ అని హిలేరియస్‌గా రిప్లూ ఇచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.