AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan: అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే! భారత్, పాక్ సీజ్ ఫైర్‌పై సల్మాన్ పోస్ట్.. నెటిజన్ల ట్రోల్స్

పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' పై సల్మాన్ ఖాన్ తో పాటు మరికొందరు బాలీవుడ్ హీరోలు కనీసం నోరు మెదపలేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కానీ ఇప్పుడు కాల్పుల విరమణపై మాత్రం తమకు నచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు.

Salman Khan: అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తుందే! భారత్, పాక్ సీజ్ ఫైర్‌పై సల్మాన్  పోస్ట్.. నెటిజన్ల ట్రోల్స్
Salman Khan
Basha Shek
|

Updated on: May 11, 2025 | 2:26 PM

Share

భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్‌పై దాడి చేయడం, ఆ తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ ప్రారంభించడంతో రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఎక్కువయ్యాయి. అయితే శనివారం (మే11) సాయంత్రం అనూహ్యంగా భారత్, పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గాయి. భారత్- పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియాలో భిన్న రకాల స్పందనలు వినిపిస్తున్నాయి. దీనిపై సినీ, క్రీడా ప్రముఖులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే సల్మాన్ కూడా భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇది క్షణాల్లోనే వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లలో కొందరు సల్మాన్ ను విపరీతంగా ట్రోల్ చేశరు. కాల్పుల విరమణపై స్పందించిన సల్మాన్ ఖాన్, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఏం చేస్తున్నాడంటూ నెటిజన్లు సల్లూ భాయ్ ను ఏకిపారేశారు.

పహల్గామ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దారుణమైన చర్యకు ప్రతిస్పందనగా, భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులను ఏరిపారేసింది. భారత సైనికుల ధైర్యసాహసాలను చాలామంది ప్రశంసించారు. కానీ కొందరు మాత్రం మౌనంగా ఉండిపోయారు. వారిలో సల్మాన్ ఖాన్ కూడా ప్రముఖుడు. అతను ఆపరేషన్ సిందూర్ గురించి ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు. కానీ ఇప్పులు సీజ్ ఫైర్ పై స్పందించిన సల్మాన్ ఖాన్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో.. ‘కాల్పుల విరమణ దేవుడికి ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు. ఇది చూసిన వెంటనే నెటిజన్లు సల్మాన్ పై మండిపడ్డారు. ‘మరి ఆపరేషన్ సింధూర్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు?’ అంటూ హీరోను ట్రోల్ చేశారు.

సల్మాన్ ఖాన్ ప్రజల నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత, అతను తన పోస్ట్‌ను తొలగించాడు. అయితే సల్మాన్ ఖాన్ అభిమానులు మాత్రం దీనిని సమర్థించుకుంటున్నారు. ‘ పాకిస్తాన్ కాల్పుల విరమణన ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అందుకే సల్మాన్ ఖాన్ ఆ పోస్ట్‌ను తొలగించారు’ అంటూ విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కాల్పుల విరమణ ప్రకటన చాలా మంది ప్రముఖులకు ఉపశమనం కలిగించింది. కరీనా కపూర్, కరణ్ జోహార్, రమ్య దివ్య స్పందన వంటి ప్రముఖులు ప్రభుత్వ చర్యను ప్రశంసించారు. కానీ సల్మాన్ ఖాన్ ఆపరేషన్ సిందూర్ గురించి మౌనంగా ఉంటూ కాల్పుల విరమణ గురించి మాత్రమే స్పందించడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..