బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఒక అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించారు. అభిమాని చర్య వల్ల విసుగు చెందారో లేదా పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగా అలా చేశారో తెలియదు కానీ.. ఆయన చేసిన ఓ పని మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఓ ఫ్యాన్ మొబైల్ ఫోన్‌ను లాక్కొని విసిరేశారు.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు ఓ ప్లేస్‌లో రణ్‌బీర్ ఉండగా.. ఆయనతో కలిసి సెల్ఫీ దిగేందుకు ఓ అభిమాని యత్నించాడు. అయితే మొదట బాగానే పోజు ఇచ్చిన రణ్‌బీర్ ఆ తర్వాత సహనం కోల్పోయాడు. ఎందుకంటే సదరు ఫ్యాన్.. ఫొటో దిగే సమయంలో ఆ పిక్ సరిగ్గా వచ్చినట్టు లేదు. దీంతో అతడు రణ్‌బీర్‌ను వెళ్లనివ్వకుండా మళ్లీ సెల్ఫీ దిగేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలోనే రణ్‌బీర్.. ఆ వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ లాక్కొని విసిరేశాడు.
ఈ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్లు రణ్‌బీర్ ప్రవర్తనను తప్పుబడుతున్నారు. అలా చేయడం సరికాదని అంటున్నారు. కాగా, రణ్‌బీర్ ఇటీవలే ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. తాజాగా శ్రద్ధా కపూర్‌తో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ తూ ఝూఠీ.. మై మక్కార్ ట్రైలర్ విడుదలైంది.
Shocking 😱 Ranbir Kapoor THROWS Fan’s Phone for annoying him for a Selfie.#RanbirKapoor pic.twitter.com/dPEymejxRv
— $@M (@SAMTHEBESTEST_) January 27, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.