RRR Movie: ఎయిర్‌లైన్స్ ఉండగా రామ్ చరణ్ సినిమాలు ఎందుకు చేస్తున్నాడు.? కపిల్ శర్మ షోలో చెర్రీ ఆసక్తికర సమాధానం..
RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంగా అత్యంత భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. వీటికి అనుగుణంగానే జక్కన్న టీమ్..
RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌ను హోరెత్తిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంగా అత్యంత భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. వీటికి అనుగుణంగానే జక్కన్న టీమ్ దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో ఆర్‌ఆర్‌ఆర్ హంగామా చేస్తోంది. ఇప్పటికే ముంబయిలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించిన చిత్ర యూనిట్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో కపిల్ శర్మ అడిగిన ఫన్నీ ప్రశ్నలకు ఆర్ఆర్‌ఆర్ టీమ్ తమదైన శైలిలో సమాధానం ఇస్తూ నవ్వులు పూయించారు.
ముఖ్యంగా ఈ షోలో రామ్ చరణ్‌ను కపిల్ శర్మ ప్రశ్నిస్తూ.. ‘మీకు ఎయిర్‌లైన్స్, హాస్పిటల్స్, హోటల్స్ ఇతర వ్యాపారాలుండగా ఎందుకు సినిమాల్లో నటిస్తున్నారు’ అని అడిగారు. దీనికి బదులిచ్చిన చరణ్.. ‘ఎయిర్‌లైన్స్ కంపెనీ ఉన్నా ఈ షోకి వచ్చే అవకాశం ఉండదు కదా’ అని తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. దీంతో అక్కడనున్న వారంతా నవ్వేశారు. ఇక.. ‘ఎన్టీఆర్ సర్ మొదటిసారి మీరు, రామ్‌చరణ్ కలిసి ఈ సినిమా చేశారు. ఇంతకు ముందు ఇలాంటి ఆఫర్ రాలేదా లేక ఇంత బడ్జెట్ పెట్టే నిర్మాత దొరకలేదా?’ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఇంత బడ్జెట్ పెట్టే నిర్మాత అప్పట్లో దొరకలేదని సమాధానమిచ్చారు.
అంతేకాకుండా మెగా ఫ్యామిలీ గురించి కపిల్ శర్మ ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ‘రామ్‌చరణ్ సర్.. మీ నాన్న చిరంజీవిగారు, బాబాయ్ పవన్ కల్యాణ్ స్టార్ హీరోలు. ఇంకా మీ ఇంట్లో పెద్ద హీరోలు ఉన్నారు. మీరంతా కలిసి భోజనం చేస్తున్నప్పుడు వాచ్‌మెన్ వచ్చి ఫ్యాన్ వచ్చారు అని చెబితే ‘ఎవరి ఫ్యాన్’ అని కన్‌ఫ్యూజ్ అవుతారా?’ అని ప్రశ్నించగా.. ‘తప్పకుండా అవుతాను. ఫ్యాన్ విషయంలోనే కాదు. ఒక దర్శకుడు వస్తే ఎవరి కోసం కథ తెచ్చారో అనే కన్‌ఫ్యూజన్ ఎక్కువ’ అని సమాధానం ఇచ్చారు. ప్రోమోలతోనే షోపై ఆసక్తిని పెంచిన ఈ షో ఫుల్ ఎపిసోడ్ ఇంకెంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: Omicron Crisis: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. నూతన ఏడాది వేడుకలపై ఆంక్షలు.. ఎక్కడంటే?
Robbery: టీవీ సీరియల్ మైకంలో మహిళలు.. ఇళ్లంతా గుల్ల చేసిన దొంగలు.. కేజీల్లో ఆభరణాలు మాయం..