Rajesh Khanna Birth Anniversary: రక్తంతో ప్రేమలేఖలు అందుకున్న నటుడు.. ఆయన ఫోటోతో పోస్టల్ స్టాంప్.. బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా!
అప్పట్లో ఆయన అమ్మాయిలకు కలల రాకుమారుడు. తెరమీద ఆయన కనిపిస్తే చాలు.. అప్పటి యువతరం కేరింతలతో థియేటర్లు దద్దరిల్లిపోయేవి. ఆయన మీద అమ్మాయిలు ఎంతగా మనసు పారేసుకునేవారో చెప్పాలంటే ఆయనకు వచ్చిన రక్తంతో రాసిన ప్రేమలేఖలు సాక్ష్యం.
Rajesh Khanna Birth Anniversary: అప్పట్లో ఆయన అమ్మాయిలకు కలల రాకుమారుడు. తెరమీద ఆయన కనిపిస్తే చాలు.. అప్పటి యువతరం కేరింతలతో థియేటర్లు దద్దరిల్లిపోయేవి. ఆయన మీద అమ్మాయిలు ఎంతగా మనసు పారేసుకునేవారో చెప్పాలంటే ఆయనకు వచ్చిన రక్తంతో రాసిన ప్రేమలేఖలు సాక్ష్యం. ఆయనే బాలీవుడ్ తోలి సూపర్ స్టార్ గా పిలిపించుకున్న రాజేష్ ఖన్నా. ఆయన 1942 సంవత్సరంలో సరిగ్గా ఇదేరోజు అంటే డిసెంబర్ 29న పంజాబ్ లోని అమృత్ సర్ లో జన్మించారు. రాజేష్ ఖన్నా జయంతి వేళలో ఆయన గురించి కొన్ని విశేషాలు..
రాజేష్ ఖన్నా అసలు పేరు జతిన్ ఖన్నా, కానీ అతని మామ సలహా మేరకు బాలీవుడ్‌లోకి ప్రవేశించే ముందు తన పేరును రాజేష్ ఖన్నాగా మార్చుకున్నాడు.
- వరుసగా 15 హిట్లు ఇచ్చిన ఏకైక నటుడు రాజేష్ ఖన్నా
- 1969 నుంచి 1971 వరకు రికార్డు స్థాయిలో 15 హిట్లు ఇచ్చాడు. అతని అద్భుతమైన విజయాల కాలం 1969లో ‘ఆరాధన’ చిత్రంతో ప్రారంభమైంది. ఇది 1971 చిత్రం ‘హాథీ మేరే సాథీ’ వరకు కొనసాగింది.
- రాజేష్ ఖన్నా విజయం .. విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్‌ను చూసిన BBC 1974లో అతనిపై ‘బాంబే సూపర్‌స్టార్’ అనే డాక్యుమెంటరీని రూపొందించింది.
- రాజేష్ ఖన్నా తన కెరీర్‌లో 100కు పైగా సోలో లీడ్ రోల్ సినిమాలు చేశాడు.
- అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు రాజేష్ ఖానా
- 70, 80 దశకాల్లో రాజేష్ ఖన్నా సినిమాల మాయాజాలం ప్రజలతో మాట్లాడేది.
- 70 .. 80 లలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు రాజేష్ ఖన్నా
- 1965లో ఫిల్మ్‌ఫేర్ టాలెంట్ హంట్‌ని గెలుచుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.
- రాజేష్ ఖన్నా 1966 చిత్రం ఆఖ్రీ ఖత్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇది 1967లో ఆస్కార్‌కి భారతదేశం మొదటి అధికారిక ప్రవేశం అయింది.
- 2013లో భారత పోస్టల్ శాఖ రాజేష్ ఖన్నాపై పోస్టల్ స్టాంపును విడుదల చేసింది.
- రాజేష్ ఖన్నా పట్ల అమ్మాయిల మోజు గురించి చాలా కథలు అప్పట్లో ప్రసిద్ధి చెందాయి.
- అతని నటనే కాదు, అతని ప్రతి స్టైల్‌లోనూ అమ్మాయిలను పిచ్చెక్కించారు. అమ్మాయిలు తమ ప్రేమను తెలియజేసేందుకు రక్తంతో రాసిన లేఖలను పంపేవారు.
- చాలా మంది అమ్మాయిలు రాజేష్ ఖన్నా ఫోటోతో వివాహం చేసుకున్నారు.
- అమ్మాయిలు తమ తెల్లటి ఫియట్ కారును ఎరుపు రంగులో లిప్ స్టిక్ గుర్తులతో తయారు చేసేవారు.
- అప్పట్లో రాజేష్ ఖన్నా పాపులారిటీ ఎంతంటే.. ఆయన ఇంటి నుంచి బయటకు రావాలంటే పోలీసుల భద్రత తప్పనిసరి అయ్యేది.
17 ఏళ్ల డింపుల్ కపాడియాతో వివాహం జరిగింది
రాజేష్ ఖన్నా నటి అంజు మహేంద్రుతో ఏడేళ్ల పాటు డేటింగ్ చేశారు, కానీ 1972లో విడిపోయారు. ఈ బ్రేకప్ తర్వాత రాజేష్ ఖన్నా కొత్త హీరోయిన్ డింపుల్ కపాడియాని పెళ్లాడాడు. అప్పటికి రాజేష్ ఖన్నా వయసు 32, డింపుల్ వయసు 17 ఏళ్లు.
రాజేష్ ఖన్నా .. డింపుల్ కపాడియాలకు ఇద్దరు కుమార్తెలు ట్వింకిల్ .. రింకే ఉన్నారు. ‘బాబీ’ సినిమా తర్వాత డింపుల్ పిల్లలను పెంచడం కోసం సినిమాలకు 12 ఏళ్ల విరామం తీసుకుంది. ఆమె .. రాజేష్ 1982లో విడిపోయారు, అయినప్పటికీ వారు విడాకులు తీసుకోలేదు.
మూడు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో, రాజేష్ ఖన్నా కేవలం 20 చిత్రాలలో మాత్రమే మల్టీ స్టారర్ మూవీ చేశారు. ఆయన మిగిలిన 100 కంటే ఎక్కువ చిత్రాలలో సోలో ప్రధాన పాత్ర పోషించారు.
హాథీ మేరే సాథీ చిత్రం ద్వారా రచయిత ద్వయం సలీం ఖాన్ .. జావేద్ అక్తర్‌లకు స్క్రీన్ రైటర్‌గా మొదటి బ్రేక్ ఇచ్చింది రాజేష్ ఖన్నా. దీని తర్వాత సలీం-జావేద్ జోడీ వెనుదిరిగి చూసుకోలేదు.
రాజేష్ ఖన్నా 69 ఏళ్ల వయసులో 18 జూలై 2012న ముంబైలో దీర్ఘకాలంగా అనారోగ్యంతో మరణించారు.
ఇవి కూడా చదవండి: Multibagger stocks: రూ.50 వేలు పెట్టుబడి పెడితే రూ.12 లక్షలు అయ్యాయి.. అదీ సంవత్సరంలోనే..
Sudan Gold Mine: కుప్పకూలిన బంగారు గని.. 38 మంది మృతి.. పదుల సంఖ్యలో క్షతగాత్రులు!
Alia bhatt: ఆర్‌ఆర్‌ఆర్ బ్యూటీకి అరుదైన గౌరవం.. మూగజీవాలపై ప్రేమకు గుర్తుగా..