AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pahalgam Terror Attack: పాక్‌లోనూ ఫవాద్ ఖాన్ అబీర్ గులాల్ సినిమాపై నిషేధం! కారణమిదే

పాకిస్తాన్ కు చెందిన ప్రముఖ నటుడు ఫహద్ ఖాన్ నటించినందున భారతదేశంలో అబీర్ గులాల్ సినిమా విడుదలను నిషేధించారు. ఇప్పుడీ బాలీవుడ్ సినిమాకు పాకిస్తాన్ లోనూ చుక్కెదురైంది. అక్కడ కూడా ఈ హిందీ సినిమాను విడుదల కాకుండా కూడా నిషేధం విధించారు.

Pahalgam Terror Attack: పాక్‌లోనూ ఫవాద్ ఖాన్ అబీర్ గులాల్ సినిమాపై నిషేధం! కారణమిదే
Abir Gulal Movie
Basha Shek
|

Updated on: Apr 29, 2025 | 12:12 PM

Share

పహల్గామ్ దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్‌తో దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ కు వెళ్లే సింధు నది జలాలను నిలిపివేస్తున్నారు. అలాగే పాకిస్తాన్ నటులు, సాంకేతిక నిపుణులు భారతీయ చిత్రాలలో పనిచేయకుండా నిషేధం విధించారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నటుడు ఫహద్ ఖాన్ నటించిన భారతీయ చిత్రం ‘అబీర్ గులాల్’ విడుదలకు అనుమతించబోమని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపింది. దీంతో చిత్ర బృందానికి పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈ సినిమాను నిషేధించింది! దీని గురించి పాకిస్తానీ చిత్ర పంపిణీదారు సతీష్ ఆనంద్ మాట్లాడుతూ, ‘అబీర్ గులాల్’ సినిమా పాకిస్తాన్‌లో విడుదల కావడం లేదని అన్నారు. ‘ ఈ సినిమాలో ఒక భారతీయ హీరోయిన్ (వాణీ కపూర్) ఉండటం వల్లే ఆ సినిమాను విడుదల చేయడానికి అనుమతి లేదు’ అని ఆయన అన్నారు. ‘విడుదల సమయం సరిగా లేకపోవడం వల్ల, సినిమా నిర్మాతలుచ పంపిణీదారులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు’ అని ఆయన అన్నారు. మొత్తానికి ‘అబీర్ గులాల్’ సినిమా పాకిస్తానీ నటుడు నటించినందుకు భారతదేశంలోనూ, భారతీయ నటి నటించినందుకు పాకిస్తాన్‌లోనూ నిషేధానికి గురైంది.

ఫహద్ ఖాన్ ఒక పాకిస్తానీ సినీ నటుడు. గతంలో పలు భారతీయ చిత్రాలలో నటించాడు. కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి కూడా. అంతేకాదు ఫహద్ ఖాన్ పాకిస్తానీ టీవీ సీరియల్స్‌లోనూ నటించాడు. ఫహద్ ఖాన్ పాకిస్తానీ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అతను నటించిన ‘మౌలా జాట్’ చిత్రం కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్‌తో పాటు భారతదేశంలో కూడా విడుదలైంది. ఫహద్ ఖాన్ తప్ప ‘అబీర్ గులాల్’ సినిమాలోని ఇతర నటులు, నటీమణులందరూ భారతీయులే. కానీ ఆ సినిమాలో ఫహద్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించడం వల్ల ఆ సినిమాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ చిత్రంలో వాణి కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఆర్తి ఎస్. బగాడి దర్శకత్వం వహించారు.

ఫహద్ ఖాన్ చివరిగా నటించిన భారతీయ చిత్రం ‘ఏ దిల్ హై ముష్కిల్’. అప్పుడు కూడా, పాకిస్తానీ నటుడిని ఎంపిక చేయడంపై వివాదం చెలరేగింది. ఆ తర్వాత పాకిస్తాన్ నటులు భారతీయ చిత్రాలలో నటించకుండా నిషేధం విధించారు. కానీ ఈ నిషేధాన్ని 2023లో ఎత్తివేశారు. అంతే కాదు, ఈ సంవత్సరం భారతదేశంలో పాకిస్తానీ సినిమాలు విడుదల కావడంపై నిషేధాన్ని కూడా ఎత్తివేశారు. ఇప్పుడు మళ్ళీ కథ మొదటికి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..