Kangana Ranaut: నేషనల్ అవార్డ్ చేజిక్కించుకున్న కంగన రనౌత్.. నాలుగుసార్లు జాతీయ పురస్కారం ఆమె సొంతం
జాతీయ అవార్డులు ఆస్కార్‌లెక్క! ఆస్కార్ సంపాదించినవాళ్లు ఎంత సంబరపడతారో జాతీయ అవార్డు వచ్చినవారు కూడా అంతగానే మురిసిపోతారు.
National Film Awardee Kangana Ranaut: మన సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకు జాతీయ అవార్డులు ఆస్కార్‌లెక్క! ఆస్కార్ సంపాదించినవాళ్లు ఎంత సంబరపడతారో జాతీయ అవార్డు వచ్చినవారు కూడా అంతగానే మురిసిపోతారు.. జాతీయ అవార్డులు నటీనటుల ప్రతిభకు గీటురాయి కాకపోయినా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఓ గర్వకారణమే! ఆ లెక్కకొస్తే చాలా మంది గొప్ప నటులకు నేషనల్ అవార్డులు రాలేదు.. అలాగని వారిని తక్కువ చేయలేం కదా! ఇప్పుడు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నాలుగో సారి జాతీయ అవార్డును దక్కించుకుంది.
మణికర్ణిక, పంగా సినిమాలకుగాను ఆమెకు జ్యూరీ అవార్డును ప్రకటించి గౌరవించింది. ఇంతకు ముందు ఆమె మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. 2008లో ఫ్యాషన్ సినిమాకు గాను, 2014లో క్వీన్ సినిమాకు గాను, 2015లో తను వెడ్స్ మను రిటర్న్స్ సినిమాకు గాను కంగనా రనౌత్‌కు జాతీయ పురస్కారాలు లభించాయి. ఇలా ఎక్కువ జాతీయ అవార్డులు గెల్చుకున్న నటీమణుల్లో కంగనా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది.
#NationalFilmAwards #NationalAwards2019 #Manikarnika #Panga pic.twitter.com/nNlF7YEa3E
— Kangana Ranaut (@KanganaTeam) March 22, 2021
మొదటి ప్లేస్‌లో అత్యుత్తమ నటీమణి షబనా ఆజ్మీ నిలిచారు. ఆమెకు ఇప్పటి వరకు అయిదు జాతీయ అవార్డులు లభించాయి. 1974లో వచ్చిన అంకూర్ సినిమాతో ఆమె నేషనల్ అవార్డుల వేట మొదలయ్యింది.. ఇది ఆమెకు రెండో సినిమా కావడం విశేషం. ఆ తర్వాత 1983 నుంచి 1985 వరకు వరుసగా మూడేళ్లు షబనా ఆజ్మీనే ఉత్తమ నటిగా నిలిచింది. అర్త్, ఖాందహార్, పార్ సినిమాలలో ఆమె కనబర్చిన అత్యుత్తమ నటనే ఆమెకు పురస్కారాలు లభించేలా చేసింది. 1999లో వచ్చిన గాడ్‌మదర్ సినిమాతో షబనా ఆజ్మీ మరో జాతీయ అవార్డును గెల్చుకుంది.
Read Also.. Kangana Birthday: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా .. నటి అవ్వడానికి ఎదుర్కొన్న కష్టాలు ఏమిటో తెలుసా..!