AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Birthday: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా .. నటి అవ్వడానికి ఎదుర్కొన్న కష్టాలు ఏమిటో తెలుసా..!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈరోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటుంది. చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో స్టార్ హీరోలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకుంది...

Kangana Birthday: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ క్వీన్ కంగనా .. నటి అవ్వడానికి ఎదుర్కొన్న కష్టాలు ఏమిటో తెలుసా..!
kangana ranaut
Surya Kala
|

Updated on: Mar 23, 2021 | 11:55 AM

Share

Kangana Birthday : బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈరోజు తన 34వ పుట్టినరోజును జరుపుకుంటుంది. చలన చిత్ర పరిశ్రమలో తన నటనతో స్టార్ హీరోలతో సమానమైన స్థానాన్ని సంపాదించుకుంది. పాత్రకి అనుగుణంగా ఆమె చూపే నటనా కౌశల్యాన్ని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు.మార్చి 23 ఆమె జన్మదినం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకుందాం..!

కంగనా హిమాచల్ ప్రదేశ్ లోని భాంబ్లా (సూరజ్పూర్) పట్టణంలో జన్మించింది. అయితే కంగనా చిన్న తనం నుంచి డాక్టర్ కావాలని కలలు కంది.. ఎప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన అమర్‌దీప్ రనౌత్ ,ఆశా రనౌత్ లకు కంగనా మార్చి 23న జన్మించింది. తండ్రి వ్యాపార వేత్త కాగా తల్లి టీచర్., కంగనా పూర్తి పేరు ‘కంగనా అమర్‌దీప్ రనౌత్’ కాగా, ఆమెను ముద్దుగా అర్షద్ అని పిలుస్తారు. కంగనా ముత్తాత సర్జు సింగ్ రనౌత్ ఎమ్మెల్యే .. ఆమె తాత ఐఎఎస్ అధికారి. కంగనాకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. అక్క రంగోలి, ఒక తమ్ముడు అక్షత్. అయితే కంగనాకు మేనేజర్‌గా అక్క రంగోలి పనిచేస్తుంది. అయితే ఒకసారి రంగోలి చందేల్ యాసిడ్ అటాక్ సమయంలో ప్రాణాలతో బయటపడింది.

కంగనా రనౌత్ తాను హీరోయిన్ కావాలనుకుంటున్నాని చెప్పిన సమయంలో కంగనా ఫ్యామిలీ ఆమెతో రిలేషన్ ను తెంపుకుంది. చాలా ఏళ్ళు కంగనా తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడలేదు.. కొన్ని ఏళ్ల తరువాత కంగనా ని ఆమె తల్లిదండ్రులు చేరదీశారు. తాను హీరోయిన్ కావడం తన తండ్రికి ఇష్టం లేదని చాలా సార్లు మీడియాతో కంగనా చెప్పింది. కంగనా 16 ఏళ్ళ వయసులో ఢిల్లీకి చేరుకుంది. అక్కడ ఫ్రాన్స్‌కు చెందిన ఎలైట్ మోడలింగ్ ఏజెన్సీకి మోడలింగ్ ప్రారంభించింది. అయితే నటనపై మనసుపడ్డ కంగనా అస్మితా థియేటర్ గ్రూపులో చేరడానికి నిర్ణయించుకుని మోడలింగ్ వృత్తిని వదిలేసింది. అరవింద్ గౌర్ దర్శకత్వం వహించిన అనేక నాటకాల్లో ఆమె నటించింది.

కంగీ అని ప్రేమగా అభిమానులు పిలుచుకుంటారు.. శిక్షణ పొందిన థియేటర్ నటి. 2006 లో ‘గ్యాంగ్‌స్టర్’ చిత్రంలో వెండి తెరపై అడుగు పెట్టింది. కంగనా మంచి నటి మంచి కథక్ నర్తకి కూడా.. రాజేంద్ర చతుర్వేది ఆధ్వర్యంలో నటేశ్వర్ నృత్య కళా మందిరంలో నాలుగు సంవత్సరాలు కథక్ నృత్యాన్ని అభ్యసించింది. క్వీన్ సినిమాకు కంగనా సహా రచయితగా పనిచేసింది. ఈ సినిమా 2014 జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. 22 సంవత్సరాల వయసులో ప్రతిష్టాత్మక జాతీయ చలన చిత్ర పురష్కారాన్ని గెలుచుకున్న అతి పిన్న వయస్కులైన నటీమణులలో ఒకరు కంగనా రనౌత్. 2008 లో రిలీజైన ఫ్యాషన్ మూవీలో పోషించిన పాత్రకు కంగనా ఉత్తమ సహాయ నటి విభాగంలో మొదటిసారిగా జాతీయ అవార్డును అందుకుంది. తర్వాత 2014 లో ‘క్వీన్’ సినిమాలో నటనకు ఉత్తమ నటి జాతీయ అవార్డు ను అందుకుంది. మళ్లీ 2015 లో ‘తనూ వెడ్స్ మను రిటర్న్స్’ లో నటనకు ఉత్తమ జాతీయ నటిగా అవార్డు ను అందుకుంది. మళ్ళీ మార్చి 22, 2021 న, కంగనా తన పుట్టినరోజుకు ఒక రోజు ముందు, ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ ‘ మరియు ‘పంగా’ చిత్రాలకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును గెలుచుకుంది. భారత ప్రభుత్వం 2020 లో పద్మశ్రీతో సత్కరించింది. కంగనా ఒక శాఖాహారి.

Also Read: మొదటి వన్డే: ఆ ఇద్దరి ప్లేయర్స్‌కు మొండిచెయ్యి.. ఓపెనర్లుగా రోహిత్-ధావన్.. టీమిండియాలో మార్పులు..

వైష్ణో దేవి దర్శనంకోసం .. ఐఆర్‌సిటిసి ప్రత్యేక ప్యాకేజీ ప్రారంభం, పూర్తి వివరాలోకి వెళ్తే..!