బాలీవుడ్‌లో కరోనా కలకలం.. తాజాగా మరో యువ హీరోకు పాజిటివ్.. ఆ హీరోయిన్లల్లో గుబులు
Bollywood: ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వెంటాడుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోకు
Covid-19 positive: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వెంటాడుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా మరో బాలీవుడ్ హీరోకు సైతం కరోనా సోకింది. యువ హీరో కార్తీక్ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆర్యన్ సోమవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ప్లస్ సింబల్‌ను షేర్ చేస్తూ..తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, త్వరగా కోలుకునేలా ప్రార్థించాలంటూ ట్విట్ చేశాడు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని.. లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కార్తీక్ సూచించాడు.
ఇదిలాఉంటే.. శనివారం ముంబైలో జరిగిన లక్మే ఫ్యాషన్ వీక్‌లో హీరోయిన్ కియారా అద్వానీ, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి.. కార్తీక్ ర్యాంప్ వాక్‌లో పాల్గొన్నాడు. అంతేకాకుండా ఇటీవలె కియారా, టబులతో కలిసి భూల్ భులైయా-2 సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. దీంతో ఇప్పడు వీరిందరికీ కరోనా భయం పట్టుకుంది. దీంతో వారంతా షూటింగ్‌కు వెళ్లకుండా క్వారంటైన్‌లోనే ఉన్నారని సమాచారం. ఇదిలాఉంటే.. నిత్యం మహారాష్ట్రలో కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే.
Positive ho gaya ??♂️ Dua karo ?? pic.twitter.com/KULStQnkA2
— Kartik Aaryan (@TheAaryanKartik) March 22, 2021
Also Read: