Malaika Arora: సెల్ఫ్ సెటైర్ వేసుకున్న బాలీవుడ్ బ్యూటీ.. అంతమాట అనేసిందేంటి..!!
దాదాపు పాతికేళ్లుగా గ్లామర్ వరల్డ్‌లో ఉంటున్నా... బాలీవుడ్‌లో మాత్రం పెద్దగా బిజీ కాలేకపోయారు మలైకా అరోరా. కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరోయిన్ రోల్స్ వైపు చూడకుండా ఐటమ్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ
నేను బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను కాదు… మోస్ట్ లవబుల్ స్టార్ అంతకన్నా కాదు.. ఇక యూత్ ఐకాన్ అన్న మాట నాకు అస్సలు సెట్ కాదు… అంటూ తన మీద తానే సెటైర్స్ వేసుకున్నారు బాలీవుడ్ గ్లామర్ దివా మలైకా అరోరా.. అసలు మలైకా ఈ కామెంట్స్ ఎందుకు చేశారు..? దాదాపు పాతికేళ్లుగా గ్లామర్ వరల్డ్‌లో ఉంటున్నా.. బాలీవుడ్‌లో మాత్రం పెద్దగా బిజీ కాలేకపోయారు మలైకా అరోరా. కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరోయిన్ రోల్స్ వైపు చూడకుండా ఐటమ్ సాంగ్స్, గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ నెమ్మదిగా అవి కూడా తగ్గించేశారు.
ఈ మధ్య సిల్వర్ స్క్రీన మీద కన్నా బుల్లి తెర మీదే ఎక్కువగా కనిపిస్తున్నారు మలైకా. డ్యాన్స్ రియాలిటీ షోస్‌లో జడ్జ్‌గా పాల్గొంటున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. వెండితెర మీద కనిపించకపోయినా… ఏదో ఒక రకంగా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. తాజాగా ఓ రియాలిటీ షోతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు మలైకా. ఈ షో ప్రమోలో తన కెరీర్ మీద తానే సెటైర్స్ వేసుకున్నారు. మలైకాను టాప్ బాలీవుడ్ ఫీమేల్ యాక్టర్ ఇంట్రడ్యూస్ చేయడంతో… ‘టాప్ యాక్టరా హౌస్‌ఫుల్ 2 చూశారుగా?’ అంటూ సెటైర్ వేశారు.
బిలవ్డ్ సెలబ్రిటీ అంటూ పరిచయం చేస్తే… నేను ఊరికే నడిచినందుకే ట్రోల్ చేస్తున్నారు బిలవ్డ్ ఏంటీ..? అంటూ మరోసారి అడ్డు చెప్పారు. యూత్ ఐకాన్‌ని అస్సలు కాదంటూ తన వయసు గురించి కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇలా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ మీద తానే సెటైర్స్ వేసుకున్న మలైక… అప్‌కమింగ్ రియాలిటీ షోలో అన్ని విషయాలు ఓపెన్‌గా మాట్లాడతానంటున్నారు.