Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు కోసం రంగంలోకి సౌత్ హీరో.. ఆ స్టార్ హెల్ప్ కావాలనుంటున్న సైఫ్..

ప్రజెంట్ బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సీనియర్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌. హీరోగా సినిమాలు చేస్తూనే.. నెగెటివ్‌ రోల్స్‌లోనూ సత్తా చాటుతున్నారు సైఫ్.. అదే సమయంలో వారసులను కూడా ఇండస్ట్రీలో ఎంకరేజ్‌ చేస్తున్నారు.

Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు కోసం రంగంలోకి సౌత్ హీరో.. ఆ స్టార్ హెల్ప్ కావాలనుంటున్న సైఫ్..
Ibrahim Ali Khan , Prithvir
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 01, 2022 | 3:57 PM

బాలీవుడ్ స్టార్స్ సౌత్‌తో మింగిల్ అయ్యేందుకు చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు దక్షిణాది సినిమాను డౌన్ సౌత్‌ అంటూ చిన్న చూపు చూసిన స్టార్స్… ఇప్పుడు మన స్టార్స్‌తో కలిసి వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తమ వారసులను కూడా సౌత్ కాంబినేషన్‌లోనే పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నారు. ప్రజెంట్ బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న సీనియర్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌. హీరోగా సినిమాలు చేస్తూనే.. నెగెటివ్‌ రోల్స్‌లోనూ సత్తా చాటుతున్నారు సైఫ్.. అదే సమయంలో వారసులను కూడా ఇండస్ట్రీలో ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఇప్పటికే సైఫ్ కూతురు సారా అలీఖాన్‌ హీరోయిన్‌గా సక్సెస్ అయ్యారు.

కొడుకు ఇబ్రహిం అలీఖాన్‌ను వెండితెరకు పరిచయం చేసే ప్లాన్‌లో ఉన్నారు సైఫ్‌. అయితే ఓన్లీ బాలీవుడ్‌ అని ఫిక్స్ అయితే కొడుకు కెరీర్‌ కష్టాల్లో పడుతుందనుకున్నారేమో… వారసుడి డెబ్యూ మూవీకి సౌత్ సపోర్ట్‌ తీసుకుంటున్నారు. అందుకే ఇబ్రహిం డెబ్యూ మూవీలో ఓ సౌత్ టాప్ స్టార్‌ కూడా ఉండేలా చూసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

స్టార్ ప్రొడ్యూసర్‌ కరణ్‌ జోహార్ బ్యానర్‌లో ఇంబ్రహిం అలీ ఖాన్ వెండితెరకు పరిచయమవుతున్నారు. కాజోల్‌ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ ఫ్యామిలీ డ్రామాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. పదేళ్ల క్రితం అయ్యా సినిమాతో నార్త్ ఎంట్రీ ఇచ్చారు పృథ్వీరాజ్‌. ఆ సినిమా సక్సెస్ కాకపోవటంతో బాలీవుడ్‌కు దూరమయ్యారు. ప్రజెంట్‌ నార్త్‌లో కూడా సౌత్ హవా కనిపిస్తుండటంతో మరోసారి బాలీవుడ్‌ వైపు చూస్తున్నారు పృథ్వీరాజ్‌. మరి సైఫ్‌ వారసుడి ఎంట్రీకి పృథ్వీరాజ్ రీ ఎంట్రీ ఎంత వరకు హెల్ప్ అవుతుందా లెట్స్ వెయిట్ అండ్ సీ.