
ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు తమ ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్లల్లో ఎన్నో సవాళ్లను దాటుకుని నటిగా మంచి పాపులారిటినీ సొంతం చేసుకున్నాయి. చాలా మంది అందం, అభినయంతో స్టార్ స్టేటస్ సంపాదించుకోగా.. మరికొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలతోనే సినీరంగానికి దూరమయ్యారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం.. దశాబ్దాలపాటు సినిమా ప్రపంచాన్ని ఏలేసింది. కెరీర్ మొదట్లో హైట్ తక్కువగా ఉందని.. నలుపు రంగులో ఉందంటూ బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కోంది. అంతేకాదు.. ఆమెను ప్రాజెక్ట్స్ నుంచి తొలగించారు. కానీ ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోని ముగ్గురు ఖాన్స్.. (షారుఖ్, సల్మాన్, ఆమీర్) వంటి స్టార్ హీరోలతో అనేక హిట్స్ అందించింది. ఇంతకీ ఆ చిన్నారిని గుర్తుపట్టారా.. ?
ఆమె పదవ తరగతిలో ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్ ఖాన్ ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె తండ్రి ఆ అవకాశాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఆమె మరెవరో కాదండి.. రాణి ముఖర్జీ. 1978 మార్చి 21న ముంబైలో జన్మించింది. ఆమె కుటుంబం సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో చిన్నప్పుడే నటనపై ఆసక్తి ఏర్పడింది. ఆమె తాత, మామ బంధువులు సినిమాల్లో పనిచేశారు. కెరీర్ మొదట్లో రాణి ముఖర్జీ హైట్ తక్కువ ఉన్నందున అనేక అవకాశాలు కోల్పోయింది. 1996లో బియర్ ఫూల్ అనే సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది హిందీలో రాజా కీ ఆయేగి బరాత్ మూవీతో తెరంగేట్రం చేసింది. మొదటి సినిమాతో నే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆదిత్య చోప్రా ఆమె నటనను ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఆమెకు తన సినిమాలో అవకాశం అందించారు.
హిందీలో బ్యాక్ టూ బ్యాక్ వరుస సినిమాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. హిందీలో తొలి చిత్రం విడుదలైన రెండు సంవత్సరాలకు మరో సినిమా చేసింది. ఆమీర్ ఖాన్ జోడిగా గులాం చిత్రం, షారుఖ్ ఖాన్ సరసన కుచ్ కుచ్ హోతా హై చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఆ తర్వాత రాణి వెనక్కి తిరిగి చూడలేదు.
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..