AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుకున్నది చెయ్.. ప్రయత్నించి చూస్తే తప్పేంటి..? సోదరికి సలహాలిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..

Katrina Giving Advice to Sister Isabella : అనుకున్నది చెయ్.. ప్రయత్నించి చూస్తే తప్పేంటి..? అంటూ బాలీవుడ్ బ్యూటీ కత్రినా

అనుకున్నది చెయ్.. ప్రయత్నించి చూస్తే తప్పేంటి..? సోదరికి సలహాలిస్తున్న బాలీవుడ్ బ్యూటీ..
Katrina Giving Advice To Si
uppula Raju
|

Updated on: Mar 13, 2021 | 6:25 PM

Share

Katrina Giving Advice to Sister Isabella : అనుకున్నది చెయ్.. ప్రయత్నించి చూస్తే తప్పేంటి..? అంటూ బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ సోదరి ఇసాబెల్లాకు సలహాలిస్తుంది. కాగా ఇసా ‘టైమ్ టు డాన్స్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కత్రినా కైఫ్ నుంచి ఎలాంటి టిప్స్ అందుకుందో ఇసాబెల్లా వివరించింది. డాన్స్‌లో బెస్ట్ అనిపించుకున్న కత్రిన, ఈ సినిమాలోని కొన్ని పాటలను చూసి నైస్ మెసేజ్ సెండ్ చేసిందని తెలిపింది.

డాన్సింగ్, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో చాలా పెద్దగా ఆలోచిస్తున్నాం అనుకుంటాం గానీ కెమెరాకు సంబంధించినంత వరకు బిగ్ కాదు బిగ్గర్‌గా ఉండాలని సూచించిందని చెప్పింది. సినిమాను కెరియర్‌గా ఎంచుకుంటానని చెప్పినప్పుడు కత్రిన చాలా సపోర్ట్ చేసిందన్న ఇసాబెల్లే.. ‘అనుకున్నది చెయ్, ప్రయత్నించి చూస్తే తప్పేంటి? ఎందుకు సక్సెస్ రాదు’ అని సలహా ఇచ్చిందని తెలిపింది.

కాగా ప్రస్తుతం కత్రినా కైఫ్ ‘టైగర్ 3’ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసిన కత్రినా త్వరలో మరో షెడ్యూల్‌లో జాయిన్ కాబోతోంది. దీంతో పాటు ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది కాంబినేషన్‌లో ‘ఫోన్ బూత్’ ప్రాజెక్ట్ కూడా చేస్తోంది. ఇక ఇసాబెల్లే.. పుల్కిత్ సామ్రాట్‌తో కలిసి సుస్వాగతం ఖుషామదిద్ సినిమాలో నటించబోతోంది. ఏది ఏమైనా కత్రినా కైఫ్ సలహాలు సోదరి ఇసాబెల్లాకు కలిసి వస్తాయో లేదో తెలియాలంటే ఆమె సినిమాలు విడుదల కావాల్సిందే.

Jr ntr political entry : ఇంతకీ రాజకీయాల్లోకి వస్తారా? రా రా? ఎవరు కోటీశ్వరులు ప్రొమో లాంచింగ్ వేళ ఎన్టీఆర్ మాటలతో కొత్త డౌట్లు.!

BECIL Recruitment: బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు… పదో తరగతి నుంచి పీజీ చేసిన వారికి అవకాశాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

Gautam Adani : సంపదలో రికార్డులు బ్రేక్ చేస్తున్న గౌతమ్ అదానీ.. ప్రపంచ కుబేరులకు షాక్‌ల మీద షాక్‌లు..