Sunjay Kapur: మరణించి ఏడు రోజులు.. ఇంకా జరగని కరిష్మా కపూర్ మాజీ భర్త అంత్య క్రియలు.. కారణమిదే
బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త, ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్ జూన్ 12న లండన్‌లో మరణించారు. పోలో ఆడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఆయన తేనెటీగను మింగేశాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం, ఆపై గుండెపోటు రావడంతో సంజయ్ కపూర్ 53 ఏళ్లకే తుది శ్వాస విడిచాడు.

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఆకస్మిక మరణం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. లండన్ లో నివాసుమున్న ఆయన పోలో గేమ్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా తేనెటీగను మింగాడు. దీంతో అది గొంతులో ఇరుక్కుపోయి, శ్వాస తీసుకోవడంతో తీవ్రమైన ఇబ్బందులు తలెత్తాయి. అదే సమయంలో గుండెపోటు కూడా రావడంతో సంజయ్ కన్నుమూశాడు. జూన్ 12న అతను తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త సంజయ్ కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా సంజయ్ కపూర్ మరణించి సుమారు ఏడు రోజులు గడుస్తోంది. అయితే ఇప్పటికీ అతనికి అంత్యక్రియలు నిర్వహించలేదు. దీనికి చట్టపరమైన ఇబ్బందులున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సంజయ్ అమెరికన్ పౌరసత్వం కలిగి ఉండటం వల్ల కొన్ని చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, దీని కారణంగా ఆయన మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడంలో ఆలస్యం జరుగుతోందని గుసగసులు వినిపిస్తున్నపాయి. అయితే ఇప్పుడీ చట్ట పరమైన సమస్యలన్నీ తొలగిపోయాయని గురువారం (జూన్ 19) న్యూ ఢిల్లీలోనే సంజయ్ కపూర్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు సంజయ్ కుటుంబ సభ్యులు అంత్యక్రియల గురించి అధికారిక సమాచారం అందించారు. గురువారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని లోధి రోడ్ శ్మశానవాటికలో సంజయ్ కపూర్ అంత్యక్రియలు జరగనున్నాయని అందులో వెల్లడించారు.
సంజయ్ లండన్‌లో మరణించారు. అయితే ఆయన అమెరికన్ పౌరసత్వానికి సంబంధించిన చట్టపరమైన లాంఛనాల కారణంగా మృతదేహాన్ని భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ఆలస్యమైందని సంజయ్ కుటుంబం తెలిపింది. ఈ క్రమంలోనే సంజయ్ కపూర్ కుటుంబం అతని అంత్యక్రియల గురించి సమాచారం ఇస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో అంత్యక్రియల సమయం, స్థలం గురించిన సమాచారాన్ని తెలిపారు. దీని తర్వాత జూన్ 22న సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో సంజయ్ కోసం ప్రార్థన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంజయ్ తల్లి రాణి సురీందర్ కపూర్, భార్య ప్రియా సచ్‌దేవ్, పిల్లలు సఫీరా, అజైరిస్ పేర్లు ఉన్నాయి. దీనితో పాటు, మాజీ భార్య కరిష్మా కపూర్ పిల్లలు సమైరా, కియాన్ పేర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Sunjay Kapur Last Rites: निधन के 8 दिन बाद आज पंचत्तवों में विलीन होंगे संजय कपूर, करिश्मा संग पिता को अंतिम विदाई देने पहुंचेगे समायरा-कियान#SunjayKapur #SunjayKapurFuneral #Delhi #KarismaKapoorkids #BollywoodNews pic.twitter.com/963P6YRD1r
— Tadka Bollywood (@Onlinetadka) June 19, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




