OTT Movie: రాజీవ్ గాంధీ హత్యపై థ్రిల్లింగ్ వెబ్ సిరీస్.. ట్రైలర్ చూశారా? స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1991 మే 21లో ఓ ఉగ్రదాడిలో అమరులయ్యారు. శ్రీలంకకు చెందిన ఎల్టీటీఈ ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో ఆత్మాహుతి దాడి చేసి ఆయనను పొట్టనపెట్టుకున్నారు. ఇప్పుడు ఈ హత్యోదంతంపై ఓ ఆసక్తికర వెబ్ సిరీస్ రానుంది.

ప్రముఖ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనిరుద్ధ్య మిత్ర రాసిన పుస్తకం నైంటీ డేస్ ఆధారంగా తెరెకెక్కిన వెబ్ సిరీస్ ‘ది హంట్.. ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య, అనంతరం జరిగిన పరిణామాలను ఇందులో చూపించారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ నగేష్ కుకునూర్ దర్శకత్వంలో.. రోహిత్ బనవాలికర్, శ్రీరామ్ రాజన్‌తో కలిసి ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. గూఢచర్యం, అనిశ్చితమైన వాతావరణం, ఇంటెలిజెన్స్ వైఫల్యంతో పాటు న్యాయం కోసం చెల్లించిన భారీ మూల్యం కలబోతగా ఈ సిరీస్‌ను రూపొందించారు మేకర్స్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో జులై 04 నుంచి ది హంట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కొలంబోలోని భారత రాయబార కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి ‘రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా?’ అని ప్రశ్నించే సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. రాజీవ్ గాంధీ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో కొన్నింటిన ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రముఖ ఓటీటీ మాధ్యమం సోనీ లివ్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, కుకునూర్ మూవీస్‌తో కలిసి ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు.
‘ది హంట్.. ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్’ వెబ్ సిరీస్ లో అమిత్ సియాల్ – డి.ఆర్. కార్తికేయన్ (ఎస్.ఐ.టి చీఫ్), సాహిల్ వైద్ – అమిత్ వర్మ (ఎస్.పీ-సీబీఐ), భగవతీ పెరుమాళ్ – రాఘవన్ (డి.ఎస్.పీ-సీబీఐ), డానిష్ ఇక్బాల్ – అమోద్ కాంత్ (డి.ఐ.జి-సీబీఐ), గిరిష్ శర్మ – రాధావినోద్ రాజు (డి.ఐ.జి-సీబీఐ), విద్యుత్ గర్గ్ – కెప్టెన్ రవీంద్రన్ (ఎన్‌ఎస్‌జీ కమాండో), శఫీక్ ముస్తఫా, అంజనా బాలాజీ, బి. సాయి దినేష్, శృతి జయన్, గౌరి మీనన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ది హంట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశముంది.
సోనీ లివ్ లో స్ట్రీమింగ్..
The assassination that shook the nation. The manhunt that stunned the world.
The Hunt – The Rajiv Gandhi Assassination Case, streaming from 4th July on Sony LIV.#TheHuntOnSonyLIV pic.twitter.com/ExOXEZxYFK
— Sony LIV (@SonyLIV) June 18, 2025








