AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut : కంగనా రనౌత్ పాస్‌పోర్ట్ రెడీ..! త్వరలో ‘ధాకాడ్’ చిత్రీకరణ కోసం విదేశాలకు..

Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాస్‌పోర్ట్ పునరుద్ధరించబడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో

Kangana Ranaut : కంగనా రనౌత్ పాస్‌పోర్ట్ రెడీ..! త్వరలో 'ధాకాడ్' చిత్రీకరణ కోసం విదేశాలకు..
Kangana Ranaut
uppula Raju
|

Updated on: Jun 29, 2021 | 7:23 PM

Share

Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పాస్‌పోర్ట్ పునరుద్ధరించబడింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గత కొన్ని రోజులుగా పాస్‌పోర్ట్ పునరుద్ధరణ గురించి కంగనా ఆందోళన చెందింది కానీ ఇప్పుడు ఆమె సమస్య పరిష్కారమైంది. త్వరలో ధాకాడ్ షూటింగ్ కోసం విదేశాలకు వెళుతున్నట్లు తెలిపింది. ఈ సంతోషకరమైన వార్తను కంగనా ధాకాడ్ దర్శకుడితో పంచుకుంటూ అభిమానులకు ఫోటో షేర్ చేసింది. దీనిపై ఇలా రాసింది ” నా పాస్‌పోర్ట్ వచ్చింది. అందరికీ ధన్యవాదాలు. చీఫ్ నేను త్వరలో మీతో ఉండబోతున్నాను అంటూ వ్యాఖ్యానించింది” కంగనాకు పాస్‌పోర్ట్ వచ్చిన తరువాత ఆమె అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

కోర్టు ఈ విషయాన్ని పాస్‌పోర్ట్ అథారిటీకి వదిలివేసింది బొంబాయి హైకోర్టులో కంగనా రనౌత్ పాస్‌పోర్ట్ పునరుద్ధరణపై సోమవారం జరిగిన విచారణలో కోర్టు పాస్‌పోర్ట్ అథారిటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కంగనా పాస్‌పోర్ట్ ను పునరుద్ధరించడం పాస్పోర్ట్ అథారిటీ బాధ్యత అని తెలిపింది. కంగనా తన రాబోయే చిత్రం ధాకాడ్ షూటింగ్ కోసం బుడాపెస్ట్ వెళ్ళవలసి వచ్చింది. దీని కోసం ఆమె పాస్‌పోర్ట్ పునరుద్ధరించాల్సి వచ్చింది.

కంగనా రనౌత్ త్వరలో తలైవిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ఏప్రిల్ 23 న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా రెండో వేవ్ కారణంగా ఇది వాయిదా పడింది. ఈ చిత్రం రెండో విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఇది కాకుండా కంగనా తన రాబోయే చిత్రం ఎమర్జెన్సీకి సన్నాహాలు కూడా ప్రారంభించింది. ఈ చిత్రంలో ఆమె ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనుంది.

Union Cabinet Expansion:తుది దశకు కేంద్ర కేబినెట్ విస్తరణ.. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్‌తో ప్రధాని భేటీ.. మంత్రుల పనితీరుపై సమీక్ష

Uber CEO : డెలివరీ బాయ్‌గా పనిచేసిన ఊబర్ సీఈవో..! ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్‌’నూ వదలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. ఇప్పుడు ఫర్‌ఫెక్ట్ అంటూ తెగ ట్రోల్ చేసేస్తున్నారు..!