Hrithik Roshan: హృతిక్ రోషన్ బర్త్ డే స్పెషల్.. విక్రమ్ వేద ఫస్ట్ లుక్ రిలీజ్..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోనూ హృతిక్‌కు ఫాలోయింగ్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. నార్త్‌లోనే కాకుండా సౌత్‌లోనూ హృతిక్‌కు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా విక్రమ్ వేద. ఈ మూవీపై అభిమానుల అంచనాలు భారీగానే ఉన్నాయి. విక్రమ్ వేద సినిమా అప్డేట్స్ కోసం హృతిక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హృతిక్ బర్త్ డే సందర్భంగా విక్రమ్ వేద నుంచి ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ లో హృతిక్ రోషన్ డాషింగ్లా కనిపిస్తున్నాడు. ఆయన రఫ్ అండ్ టఫ్ లుక్ ఆకట్టుకుంటుంది.
గడ్డంతో కన్పిస్తున్న వేద నల్ల కళ్లద్దాలతో, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిపోయి కనిపిస్తున్నాడు హృతిక్. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యాక్షన్ బ్యాగ్రాండ్లో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన విక్రమ్ వేద చిత్రానికి హిందీ రీమేక్.. ఇందులో విక్రమ్ పాత్రలో మాధవన్.. వేద పాత్రలో విజయ్ సేతుపతి నటించి మెప్పించారు. ఒరిజినల్ తెరకెక్కించిన డైరెక్టర్ పుష్కర్ గాయత్రి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.. హీరోయిన్ రాధిక ఆప్టే కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటివరకు అబుదాబిలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరిగింది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ ఫిల్మ్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, ఫ్రైడే ఫిల్మ్ వర్క్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
View this post on Instagram
డల్ గా పోస్ట్ లు పెడుతున్న షణ్నూ.. ఫీలవుతున్న ఫ్యాన్స్.. చెయ్‌రా చిచ్చా.. మస్తు మజా అంటూ..
Pushpa: పుష్ప సినిమా కాదు ఒక అనుభవం.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించిన అర్జున్ కపూర్..




