AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తన మొదటి సినిమాకు తానే వీధుల్లో పోస్టర్స్ పంచిన హీరో.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.. ఎవరో తెలుసా ?..

చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించి.. ఆ తర్వాత హీరోగా మారిన నటుల గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ కుర్రాడు ఒకరు. ఒకప్పుడు చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. పైన ఫోటోను గమనించారా ?.. ఆ చిన్నోడు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో. అతడి తండ్రి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. ఈరోజుతో ఆయన 59వ సంతవ్సరంలోకి అడుగుపెడుతున్నాడు.

Tollywood: తన మొదటి సినిమాకు తానే వీధుల్లో పోస్టర్స్ పంచిన హీరో.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు.. ఎవరో తెలుసా ?..
Actor
Rajitha Chanti
|

Updated on: Mar 14, 2024 | 9:03 AM

Share

ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ పరిశ్రమలో నటుడిగా ఎదగాలని.. తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఎన్నో అడ్డంకులను, సవాళ్లను ఎదుర్కొని నటుడిగా ఇప్పుడు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక చిత్రాల్లో నటించి.. ఆ తర్వాత హీరోగా మారిన నటుల గురించి చెప్పక్కర్లేదు. అందులో ఈ కుర్రాడు ఒకరు. ఒకప్పుడు చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ చిన్నోడు.. ఇప్పుడు హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలు పోషించి తనదైన నటనతో మెప్పిస్తున్నాడు. పైన ఫోటోను గమనించారా ?.. ఆ చిన్నోడు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో. అతడి తండ్రి ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. ఈరోజుతో ఆయన 59వ సంతవ్సరంలోకి అడుగుపెడుతున్నాడు. మార్చి 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ హీరోకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినీ బ్యాగ్రౌండ్ ఫ్యామిలీ నుంచి నటుడిగా అడుగుపెట్టినా.. ఎన్నో అవమానాలను ఎదుర్కొని స్టార్ డమ్ అందుకున్నాడు. తొలి నాళ్లలో తన సినిమాకు పోస్టర్స్ స్వయంగా వీధుల్లో పంచాడు. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా ?.. అతడు మరెవరో కాదు.. బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్.

1973లో వచ్చిన యాదోంకీ బారాత్ సినిమాలో బాలనటుడిగా నటించాడు అమీర్ ఖాన్. ఆ తర్వాత 1988లో హీరోగా ఖయామత్ సే ఖాయమత తక్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఇందులో జుహీ చావ్లా కథానాయికగా నటించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. ఫస్ట్ సినిమా తర్వాత అమీర్ ఖాన్ వెనుదిరిగి చూసుకోలేదు. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు అగ్ర కథానాయకుడిగా బీటౌన్ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. రాఖ్, దిల్, రాజా హిందుస్తానీ, సర్ఫరోష్ వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. గజిని, త్రీ ఇడియట్స్, ధూమ్ 3, పీకే చిత్రాలతో కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. కానీ మీకు తెలుసా.. తొలి సినిమాకు స్వయంగా ప్రచారం చేసుకున్నాడు.

అమీర్ ఖాన్ ఫస్ట్ మూవీ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ కొన్ని కారణాలతో ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. జుహీ చావ్లా, అమీర్ కిస్ సీన్, పాటలు ఇప్పటికీ సోషల్ మీడియా చర్చ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో తన నటన తనకే నచ్చలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో అన్నారు అమీర్. ఈ సినిమా విడుదల సమయంలో నటి జూహీ చావ్లాతో కలిసి సినిమా పోస్టర్లను ఆటోలకు, రిక్షా పుల్లర్ లకు పంపిణీ చేశారు. ఈ సినిమా పోస్టర్లను తమ ఆటోలకు, రిక్షాలకు అతికించాలని కోరాడు. ఆ తర్వాత వీధుల్లో తమ సినిమా పోస్టర్స్ పంచారు. ఇలా ప్రమోషన్స్ చేయడంతో అప్పట్లో ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. 29 ఏప్రిల్ 1988న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ‘అకేలే హై తో క్యా ఘమ్ హై’ పాట షూటింగ్ సమయంలో జూహీ చావ్లా అమీర్ చెంప, నుదిటిపై ముద్దు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ జూహీ మాత్రం అమీర్ కిస్ చేసేందుకు నిరాకరించింది. దర్శకుడు కోరిన తరువాత, జూహీ అమీర్‌ను ముద్దు పెట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా