TOP9 ET: 2నెలల డేట్స్‌కే 100 కోట్ల రెమ్యునరేషన్ | దారుణం.. రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో.

డేట్స్‌ ఏమో 2 నెలలు.. అంటే 60 రోజులు! కానీ రెమ్యునరేషన్ మాత్రం 100 కోట్లు! ఎస్ ! ఓ బిగ్ రీజనల్ ఫిల్మ్ తీసేంత రెమ్యునరేషన్‌ను బాలీవుడ్ అప్‌ కమింగ్ ఫిల్మ్ వార్‌2 కోసం తీసుకుంటున్నారట హృతిక్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇద్దరూ కలిసి యాబై యేసి కోట్లు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను వసూలు చేస్తున్నారట. ఇక యాశ్‌ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందట.

TOP9 ET: 2నెలల డేట్స్‌కే 100 కోట్ల రెమ్యునరేషన్ | దారుణం.. రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో.

|

Updated on: Mar 14, 2024 | 7:51 PM

01.ntr: జస్ట్‌ 2నెలల డేట్స్‌కే 100 కోట్ల రెమ్యునరేషన్

డేట్స్‌ ఏమో 2 నెలలు.. అంటే 60 రోజులు! కానీ రెమ్యునరేషన్ మాత్రం 100 కోట్లు! ఎస్ ! ఓ బిగ్ రీజనల్ ఫిల్మ్ తీసేంత రెమ్యునరేషన్‌ను బాలీవుడ్ అప్‌ కమింగ్ ఫిల్మ్ వార్‌2 కోసం తీసుకుంటున్నారట హృతిక్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇద్దరూ కలిసి యాబై యేసి కోట్లు ఈ సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను వసూలు చేస్తున్నారట. ఇక యాశ్‌ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోందట. ఇప్పటికే హృతిక్ ఈ మూవీ టీంతో జాయిన్‌ అయిన.. యాక్షన్ సీక్వెన్స్‌లలో పాల్గొంటున్నారు. తారక్‌ కూడా ఇవ్వాళో లేక రోపో.. వెళ్లి హృతిక్ తో జాయిన్ అవ్వనున్నారు.

02.rshmika: దారుణం.. రష్మికపై మరో డీప్ ఫేక్ వీడియో

డీప్‌ ఫేక్ వీడియోలు దారుణంగా హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్నాయి. వారిని నెట్టింట కాస్త తప్పుగా ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. ఇక ఇప్పటికే డీప్‌ ఫేక్ వీడియోతో.. ఓ రేంజ్‌లో డిస్ట్రబ్ అయిన రష్మిక .. మరో సారి డీప్‌ ఫేక్‌ గాళ్ల బారిన పడింది. మరో డీప్‌ ఫేక్ వీడియోతో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మునపటిలాగే ఈ వీడియోలో కూడా.. కాస్త ఓవర్‌గా ఉండడం అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. మరో సారి డీప్‌ ఫేక్ టెక్నాలిజీని బ్యాన్ చేయాలనే టాక్ వచ్చేలా చేస్తోంది.

03.mahesh: ప్రేమలు మూవీ చూసి నవ్వలేక చచ్చా…

ఎట్ ప్రజెంట్ తన పెండింగ్ యాడ్ షూట్స్‌తో.. జక్కన్న మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో కాస్త బిజీగా ఉన్న మహేష్‌.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గానే ఉంటున్నారు. తన ఫీలింగ్స్‌ను దాపరికం లేకుండా షేర్ చేసుకుంటూనే ఉంటున్నారు. ఇక ఈ క్రమంలోనే జక్కన్న తనయుడు కార్తికేయ తెలుగులో రిలీజ్‌ చేసిన ప్రేమలు మూవీపై తాజాగా తన రివ్యూ ఇచ్చేశారు. గతంలో ఎప్పుడూ నవ్వలేనంతగా.. ఈ సినిమా చూసి నవ్వా.. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేశా అంటూ ట్వీట్ చేశారు.

04. shivakarthi: నాకు చాలా బాధలున్నాయి.. కన్నీరు పెట్టుకున్న స్టార్‌ హీరో

కింద నుంచి పైకి! చాలా కష్టపడి ఎదిగిన కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా ఎమోషనల్ అయ్యారు. తనకు జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయాని.. ఆ సమస్యల తాలూకు బాధలు తనను వెంటాడుతున్నాయని అన్నారు. ఆ సమస్యలను.. బాధలను పంచుకోడానికి నాన్న కానీ.. అన్న కానీ లేరని.. కానీ వాళ్లను మీలోనే చూసుకుంటున్నా అంటూ.. అభిమానులతో ఎమోషనల్‌గా చెప్పారు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.

05.teja sajja: చరణ్‌, తారక్‌ తర్వాత.! ఈ ఘనత దక్కింది తేజా సజ్జాకే!

ఇప్పుడు తేజా సజ్జా నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు. బీజేపీ బడా నేత అమిత్‌ షాను నేరుగా కలవడంతో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. టాలీవుడ్ హీరోస్‌.. చరణ్, తారక్‌ తర్వాత అమిషాను కలిసిన మరో తెలుగు హీరోగా ఇప్పుడు ట్యాగ్ వచ్చేలా చేసుకున్నాడు. ఇక పొలిటికల్ మీట్లో భాగంగా.. హైద్రాబాద్‌కు వచ్చిన అమిత్‌ షాను.. తేజా సజ్జా మాత్రమే కాదు.. హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కలిశారు. ఆయనకు హనుమాన్ జ్ఞాపికను కూడా అందజేశారు.

06.manjummel boys: అదో చెత్త సినిమా..

మంజుమ్మల్ బాయ్స్! మల్లూ వుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్టైంది. దాదాను 150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ హిట్ సినిమాపైనే షాకింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ స్టార్ రైటర్ జయమోహన్. ఈ సినిమా పరమ చెత్త సినిమా అంటూ ఏకిపారేశారు. కేరళ మేకర్స్‌ లోఫర్స్‌ అంటూ దారుణంగా విమర్శించారు. తప్పతాగి నిషేధిత ప్రాంతంలోకెళ్లి లోయలో పడటాన్ని చాలా గొప్పగా చూపించడం ఓ చెత్త పని అంటూ డైరెక్టర్‌పై ఘరం అయ్యారు.

07. devi sri prasad: గుర్తు పట్టలేనంతగా మారిన దేవిశ్రీ ప్రసాద్

పుష్ప సినిమాకిచ్చిన హిట్ సాంగ్స్‌ అండ్ బీజీఎమ్స్‌తో… పాన్ ఇండియా రేంజ్‌ క్రేజ్ తెచ్చుకున్న దేవీ… ఆ సినిమా సాంగ్స్‌ కు గాను ప్రెస్టీజియప్ నేషనల్ అవార్డ్‌ కూడా అందుకున్నాడు. ఎట్ ప్రజెంట్ పుష్ప2, సూర్య కంగువా.. సాంగ్స్‌ కంపోజింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే తన గురువు.. ఆల్‌ టైం ఫెవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ తన స్టూడియోకు వచ్చాడంటూ.. కొన్ని ఫోటోలను షేర్ చేశారు డీఎస్‌పీ. అయితే ఆ ఫోటోల్లోనే దేవీ మునుపటిలా కాకుండా బక్క చిక్కి.. ముఖంలో కళ లేకుండా కనిపించాడు. దీంతో దేవీకి ఏం అయింది. ఇలా మారిపోయాడు అంటూ ఆయన ఫ్యాన్స్‌ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. దేవీ మునుపటి ఫోటోలను.. ఇప్పటి ఫోటోలను కలిపి నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు.

08.surya, jyothika: ఆస్తుల్లో సూర్యను మించిపోయిన భార్య జ్యోతిక

కోలీవుడ్‌లో ఉన్న వన్‌ ఆఫ్ ది బెస్ట్ కపుల్స్‌లో సూర్య, జ్యోతిక ఒకరు. ఎట్ ప్రజెంట్ వారి వారి సినిమాలతో బిజీగా ఉన్న వీరిద్దరూ… వీరిద్దరి ఆస్తుల గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే అకార్డింగ్ టూ ఆ న్యూస్.. స్టార్ హీరో సూర్య ఆస్తి కంటే.. భార్య జ్యోతిక ఆస్తే ఎక్కవట. సూర్య కంటే దాదాపు 125 కోట్ల వ‌ర‌కు ఎక్కువ‌గా ఆస్తుల‌ను కూడేసిందట జ్యోతిక. అయితే ఈ న్యూస్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

09.actress aishwarya addala: పెళ్లి పేరుతో యువకుడిని బకారా చేసిన సీరియల్ నటి

అత్తారింటికి దారేది.. పలుకే బంగారమాయే ఫేం.. అడ్డాల ఐశ్వర్య.. తనను పెళ్లి పేరుతో మోసం చేసిందని ఆరోపించాడు శ్యామ్ కుమార్. మ్యాట్రిమోని ద్వారా 2023 సెప్టెంబర్‌లో నటి ఐశ్యర్యను పెళ్లి చేసుకున్న తాను.. ఆ తర్వాత ఐశ్వర్య ఎఫైర్ తెలిసి షాకయ్యానన్నాడు. ఈ విషయం తనకు తెలియడంతో… విడాకులు ఇవ్వాలంటూ.. తనను బెదిరించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను విడాకులకు ఒప్పుకోకపోవడంతో.. తనపై తన కుటుంబంపై కేసులు పెట్టి.. తనను తన కుటుంబాన్ని రోడ్డున పడేసిందని ఎమోషనల్ అయ్యాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us