Tollywood: సాహసాలకు నిలువెత్తు రూపం.. ఈ స్టార్ హీరోను గుర్తుపట్టగలరా ?..
ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులలో ఆయన ఒకరు. ఒకప్పుడు వరుస విజయాలతో టాప్ హీరోగా దూసుకుపోయిన ఆయన.. ఇప్పుడు పరాజయాలతో సతమతమవుతున్నారు. కేవలం హీరోయిజం చిత్రాలు కాకుండా రియల్ లైఫ్ స్టోరీస్.. బయోపిక్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయినప్పటికీ తన ప్రయత్నాలను వదిలిపెట్టడం లేదు. ప్రేక్షకుల ముందుకు మరిన్ని సరికొత్త కథలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత జీవితంతోపాటు.. సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న చిరునవ్వుతో జయిస్తున్నాడు ఈ హీరో.

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న హీరో. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పాత్రకు తన నటనతో ప్రాణం పోసే హీరో. ఇండస్ట్రీలోని అగ్రకథానాయకులలో ఆయన ఒకరు. ఒకప్పుడు వరుస విజయాలతో టాప్ హీరోగా దూసుకుపోయిన ఆయన.. ఇప్పుడు పరాజయాలతో సతమతమవుతున్నారు. కేవలం హీరోయిజం చిత్రాలు కాకుండా రియల్ లైఫ్ స్టోరీస్.. బయోపిక్స్ చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అయినప్పటికీ తన ప్రయత్నాలను వదిలిపెట్టడం లేదు. ప్రేక్షకుల ముందుకు మరిన్ని సరికొత్త కథలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత జీవితంతోపాటు.. సినీ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్న చిరునవ్వుతో జయిస్తున్నాడు ఈ హీరో. ఇంతకీ అతడు ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు తన కొత్త సినిమాలోని లుక్ నెట్టింట వైరలవుతుంది. అతడే స్టార్ హీరో అమీర్ ఖాన్. ఎన్నో ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్దా మూవీ పరాజయం కావడంతో ఇప్పుడు నటించే సినిమాలపై మరింత శ్రద్ధ పెట్టాడు అమీర్ ఖాన్.
ప్రస్తుతం ఆయన ‘సితారే జమీన్ పర్’ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఆయన కొత్త గెటప్ నెట్టింట వైరలవుతుంది. దీంతో అమీర్ ఖాన్ కొత్త సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే ఈ లుక్ ఇంకా అధికారికంగా రివీల్ కాలేదు. దీంతో ఈ స్టిల్ ఏ సినిమాలోనిది అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ‘సితారే జమీన్ పర్’ సినిమాలో నటిస్తున్న దర్శీల్ సఫారీ కొన్ని ఫోటోలను నెట్టింట షేర్ చేశాడు. “ఇది అమీర్ ఖాన్ మల్టీవర్స్. మేమంతా అందులోనే జీవిస్తున్నాం” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో అమీర్ కొత్త ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది.
ఈరోజుల్లో సెలబ్రిటీలు చాలా పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. తమ గుర్తింపు పొందిన బ్రాండ్‌లను ప్రమోట్ చేయడానికి కొత్త ఆలోచనలతో ప్రచారం చేస్తున్నారు. అయితే అమీర్ ఖాన్ వైరల్ ఫోటో వెనుక కూడా ఇదే తరహా ప్రచార వ్యూహం ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఇది అడ్వర్టైజ్‌మెంట్ ఫోటో అయి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అమీర్ ఖాన్ ఫోటో నెట్టింట తెగ వైరలవుతుంది. అమీర్ ఖాన్ దర్శకత్వంలో ‘తారే జమీన్ పర్’ చిత్రం 2007లో విడుదలైంది. ఇందులో నటుడు దర్శీల్ సఫారీ కీలకపాత్ర పోషించాడు. దాదాపు 16 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ‘సితారే జమీన్ పర్’ సినిమాలో నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



