- Telugu News Photo Gallery Cinema photos Heroine Sobhita Dhulipala told the secret of not getting opportunities in Tollywood Telugu Actress Photos
Sobhita Dhulipala: అవకాశాలు రాకపోవడానికి సీక్రెట్ చెప్పిన హీరోయిన్ శోభిత ధూళిపాళ.
మిస్ ఇండియా టైటిల్ గెలిచిన శోభితా దూళిపాల... సిల్వర్ స్క్రీన్ మీద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో సినిమాలు చేస్తున్నా అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే రాలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ బ్యూటీ. తాజాగా తన తొలి అవకాశం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్‌తో పాటు డిజిటల్‌లోనూ తన మార్క్ చూపించిన శోభితా ధూళిపాల కెరీర్‌ను మలుపు తిప్పే బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.
Updated on: Mar 06, 2024 | 7:45 PM

మిస్ ఇండియా టైటిల్ గెలిచిన శోభిత ధూళిపాళ.. సిల్వర్ స్క్రీన్ మీద బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌లలో సినిమాలు చేస్తున్నా అనుకున్న రేంజ్ సక్సెస్ అయితే రాలేదు. అయినా పట్టువదలకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఈ బ్యూటీ.

తాజాగా తన తొలి అవకాశం గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్‌తో పాటు డిజిటల్‌లోనూ తన మార్క్ చూపించిన శోభితా ధూళిపాల కెరీర్‌ను మలుపు తిప్పే బిగ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ సందర్భంగా తన కెరీర్ ఎర్లీ డేస్‌లో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడారు. గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగు పెట్టిన కొత్తలో చాలా టీవీ కమర్షియల్స్‌కు ఆడిషన్స్ ఇచ్చినా.. ఎవరూ తనను సెలెక్ట్ చేయలేదని, అప్పట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా అని గుర్తు చేసుకున్నారు.

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తాను, ఒక్క ఛాన్స్ అంటూ చాలా ప్రయత్నాలు చేశానని చెప్పారు. మూడేళ్ల పాటు ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నా అన్నారు.

ఆ టైమ్‌లోనే రామన్ రాఘవ్ 2.0 ఆఫర్ వచ్చిందని, ఆ ఆఫర్ రాకపోయి ఉంటే... వెయ్యి ఆడిషన్స్ ఇచ్చేదాన్ని అన్నారు శోభితా ధూళిపాళ. ఎర్లీ డేస్‌లో యాడ్స్ కోసం చేసిన ఆడిషన్స్‌లోనూ తనను రిజెక్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు.

తన లుక్స్, ఫిజికల్ అప్పియరెన్స్ మీద నెగెటివ్ కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో ఏ బ్రాండ్స్ అయితే తనను రిజెక్ట్ చేశాయో ఇప్పుడు అదే బ్రాండ్స్‌కు తాను ప్రమోటర్‌గా ఉండటం తన లైఫ్‌లో బిగ్గెస్ట్ అచ్చీవ్‌మెంట్ అంటున్నారు శోభిత.

గ్లామర్ ఫీల్డ్‌లో ఫుల్ బిజీగానే ఉన్నా... వెండితెర మీద మాత్రం ఆ రేంజ్‌లో జోరు చూపించలేకపోతున్నారు శోభితా. వరుసగా అవకాశాలు వస్తున్నా... హీరోయిన్‌గా స్టార్ ఇమేజ్ మాత్రం దక్కటం లేదు.

ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు వచ్చినా, అవి గెస్ట్ రోల్స్ లా కాసేపు తెర మీద కనిపించే క్యారెక్టర్సే కావటంతో.. అమ్మడికి అనుకున్న స్థాయి గుర్తింపు రావటం లేదు.




