- Telugu News Photo Gallery Cinema photos Janhvi Kapoor birthday spcieal her beautiful photos goes viral telugu movie news
Janhvi Kapoor: పరికిణిలో అందాల వెన్నెల.. భూవిపై ఉన్న సుమధుర సౌందర్యం.. జాన్వీ బ్యూటీఫుల్ ఫోటోస్..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు నేడు (మార్చి 6). ఈ సందర్భంగా ఈ అందాల తారకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, సన్నిహేతులు, అభిమానులు, నెటిజన్స్ జాన్వీకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ తార.. ఆ తర్వాత హిందీలో వరుస మూవీస్ చేసింది. కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ..
Updated on: Mar 06, 2024 | 7:09 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పుట్టిన రోజు నేడు (మార్చి 6). ఈ సందర్భంగా ఈ అందాల తారకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ ప్రముఖులు, సన్నిహేతులు, అభిమానులు, నెటిజన్స్ జాన్వీకి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ తార.. ఆ తర్వాత హిందీలో వరుస మూవీస్ చేసింది. కేవలం గ్లామర్ రోల్స్ కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూ.. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టులతో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది జాన్వీ కపూర్.

ప్రస్తుతం తెలుగు తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఇందులో జాన్వీ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీతోనే టాలీవుడ్ అడియన్స్ ముందుకు రాబోతుంది జాన్వీ.

అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన ప్రాజెక్టులోనూ ఎంపికైంది జాన్వీ. ఇప్పటికే ఈ విషయం అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఇవే కాకుండా తెలుగు, తమిళంలో తనకు ఆఫర్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నానని ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చింది.

పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది జాన్వీ. పట్టు పరికిణిలో ఎంతో అందంగా కనిపించింది. దర్శనం అనంతరం ఈ బ్యూటీ గ్రీన్ గార్డెన్ లో ఫోటోషూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.




